News June 18, 2024
T20 WC: నికొలస్ పూరన్ రికార్డు

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నికొలస్ పూరన్ రికార్డ్ సృష్టించారు. పురుషుల క్రికెట్‌లో వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో 2వేల రన్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. అఫ్గాన్‌పై ఆయన 53 బంతుల్లోనే 98 పరుగులు చేశారు. మొత్తంగా విండీస్ 218 రన్స్ చేయగా.. ఛేదనలో అఫ్గాన్ ఇప్పటికే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది.
Similar News
News January 24, 2026
కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ

TG: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న విచారణకు హాజరైన విషయాలను గులాబీ బాస్‌కు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో హరీశ్ రావు కూడా ఫామ్‌హౌస్‌కు చేరుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్, హరీశ్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
News January 24, 2026
అమ్మాయితో అడ్డంగా దొరికిన పలాశ్.. ఫ్రూఫ్ ఏదని ప్రశ్న!

క్రికెటర్ స్మృతి మంధాన మాజీ లవర్ <<18940645>>పలాశ్<<>>పై వస్తున్న ఆరోపణలను అతని లాయర్ శ్రేయాన్ష్ కొట్టిపారేశారు. మరో అమ్మాయితో పలాశ్ అడ్డంగా దొరికిపోయాడన్న విద్యాన్ మానే ఆరోపణలను లాయర్ కొట్టిపారేస్తూ.. ‘దానికి సాక్ష్యం ఏది?’ అని ప్రశ్నించారు. అలాగే ₹40 లక్షల ఫ్రాడ్ ఆరోపణలపై స్పందిస్తూ ఆ డబ్బు చెక్కు ద్వారా ఇచ్చారా లేక ట్రాన్స్‌ఫర్ చేశారా అని నిలదీశారు. అతనికి లీగల్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
News January 24, 2026
రథ సప్తమి పూజ ఎలా చేయాలంటే..?

రథసప్తమి నాడు సూర్యరశ్మి పడే చోట ఆవు పేడతో శుద్ధి చేయాలి. పిడకల పొయ్యి పెట్టాలి. ఇత్తడి పాత్రలో ఆవు పాలను పొంగించాలి. పాలు పొంగే సమయంలో కొత్త బియ్యం, బెల్లంతో పరమాన్నం చేయాలి. దాన్ని చిక్కుడాకుల్లో సూర్యుడికి నివేదించాలి. అనంతరం అందరికీ వితరణ చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే చిక్కుడు కాయలు, కొబ్బరి పుల్లలతో చిన్న రథాన్ని తయారు చేసి పూజించాలి. పాలు పొంగడం ఇంటి అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు.


