News November 9, 2024
T20I: భారత్ తరఫున అత్యధిక సెంచరీలు
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(5) అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్ (4), కేఎల్ రాహుల్ (2), సంజూ శాంసన్ (2) ఉన్నారు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాపై వరుస సెంచరీలు చేసిన సంజూ ఈ జాబితాలో కేఎల్ సరసన చేరారు.
Similar News
News December 10, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 10, 2024
మోహన్‌బాబు రాసిన లేఖలో ఇంకేముందంటే?
TG: తాను HYD జల్‌పల్లిలో పదేళ్లుగా ఉంటున్నానని, ఇల్లువదిలి వెళ్లిపోయిన <<14835430>>మనోజ్<<>> 4నెలల కిందట తిరిగొచ్చారని రాచకొండ CPకి రాసిన లేఖలో మోహన్‌బాబు చెప్పారు. ‘అతను తన భార్య, మరికొందరితో కలిసి నన్ను ఇంటి నుంచి పంపాలని చూశాడు. తన 7నెలల కుమార్తెను ఇంటి పనిమనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్‌లోని నా ఆఫీసు సిబ్బందిని 30మందితో బెదిరించాడు. నేను 78ఏళ్ల సీనియర్ సిటిజన్‌ని. రక్షణ కల్పించండి’ అని రాశారు.
News December 10, 2024
డిసెంబర్ 10: చరిత్రలో ఈ రోజు
1878: స్వాతంత్ర్య సమరయోధుడు, భారత గవర్నర్ సి.రాజగోపాలచారి(ఫొటోలో) జననం
1896: డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం
1952: సినీ నటి సుజాత జననం
1955: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన రోజు
1985: సినీ నటి కామ్నా జఠ్మలానీ జననం
* అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం