News June 29, 2024
T20WC: చరిత్రలో ఇదే తొలిసారి

ఇవాళ T20WC ఫైనల్లో తలపడనున్న భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఓ అరుదైన ఘనతను నమోదు చేశాయి. గ్రూప్, సూపర్-8 దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడని టీమ్‌లు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. భారత్ గ్రూప్ దశలో ఐర్లాండ్, పాక్, USA, సూపర్-8లో అఫ్గాన్, బంగ్లా, ఆసీస్, సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించింది. సౌతాఫ్రికా గ్రూప్ దశలో శ్రీలంక, నెదర్లాండ్స్, బంగ్లా, నేపాల్, సూపర్-8లో USA, ఇంగ్లండ్, విండీస్, సెమీస్‌లో అఫ్గాన్‌పై గెలిచింది.
Similar News
News December 12, 2025
ECHSలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

విశాఖపట్నంలోని <
News December 12, 2025
అక్కడ ‘జాగృతి’ బోణీ.. ఇక్కడ 95 ఏళ్ల వయసులో సర్పంచ్!

TG: పంచాయతీ ఎన్నికల్లో కవిత నేతృత్వంలోని ‘తెలంగాణ జాగృతి’ బోణీ కొట్టింది. NZB(D) వీరన్నగుట్ట తండా, తాడ్‌బిలోలి పంచాయతీల్లో జాగృతి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. అటు KCR దత్తత గ్రామం యాదాద్రి(D) వాసాలమర్రిలో ఓట్లు సమానంగా రావడంతో టాస్ వేయగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలిచారు. మరోవైపు SRPT(D) నాగారం సర్పంచ్‌గా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి (వయసు 95 ఏళ్లు) ఎన్నికయ్యారు.
News December 12, 2025
పందుల నుంచి పంటను కాపాడే ద్రావణం!

కొందరు రైతులు పందుల బారి నుంచి తమ పంటను రక్షించుకోవడానికి కుళ్లిన కోడిగుడ్లను నీటిలో కలిపి పంట చుట్టూ చల్లుతున్నారు. ఈ ద్రావణం నుంచి వచ్చే సల్ఫర్ వాసన పందులకు చాలా అసహ్యంగా అనిపించడంతో పాటు పంట సహజ వాసనను వాటికి రానివ్వదు. దీంతో పందులు ఆ ప్రాంతానికి రావడానికి ఇష్టపడవని నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షం పడినా లేదా వారం తర్వాత వాసన తగ్గిపోతే ఈ ద్రావణాన్ని పొలం చుట్టూ మళ్లీ చల్లాల్సి ఉంటుంది.


