News June 12, 2024
T20WC: 17వ బంతికి ఖాతా తెరిచిన నమీబియా కెప్టెన్

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ పరుగులు చేయలేక ఆపసోపాలు పడుతున్నారు. తన మొదటి రన్ సాధించడానికి ఏకంగా 17 బంతులు ఎదుర్కొన్నారు. ఆసీస్ పేసర్ల ధాటికి నమీబియా కెప్టెన్‌తో పాటు ఇతర బ్యాటర్లు కూడా విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 13 ఓవర్లలో 43/8గా ఉంది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4, హేజిల్‌వుడ్ 2 వికెట్లతో రాణించారు.
Similar News
News January 28, 2026
ఇమ్రాన్ కంటి చూపు కోల్పోయే ప్రమాదం: PTI

అవినీతి ఆరోపణలతో మూడేళ్లుగా జైలులో మగ్గుతున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ <<18620748>>ఆరోగ్యంపై<<>> PTI పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయన తీవ్ర కంటి సమస్యతో బాధపడుతున్నారని, వెంటనే ఆస్పత్రిలో చికిత్స అందించకపోతే శాశ్వతంగా చూపును కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. కోర్టు ఆర్డర్లనూ జైలు సిబ్బంది పట్టించుకోవట్లేదని మండిపడింది. అలాగే కుటుంబసభ్యులు, స్నేహితులను కలిసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది.
News January 28, 2026
హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చే సమస్యలివే..

మన శరీరంలోని జీవక్రియలు సరిగా జరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా హార్మోన్లదే కీలకపాత్ర. అయితే వీటిలో అసమతుల్యత రావడం వల్ల వంధ్యత్వం, మొటిమలు, మధుమేహం, థైరాయిడ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడీ వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. మొటిమలు, జుట్టు రాలడం, బరువులో మార్పులు, నిద్రలేమి, ఆకలి పెరగడం/ తగ్గడం వంటి లక్షణాల ద్వారా హార్మోన్ల అసమతుల్యతను ముందుగానే గుర్తించొచ్చంటున్నారు.
News January 28, 2026
మేడారానికి భారీగా వైద్య సిబ్బంది

TG: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా చికిత్స చేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. మేడారంలో 50 పడకల ఆస్పత్రి, జాతర ప్రాంగణంలో 30 మెడికల్ క్యాంపులు, రూట్లలో 42 క్యాంపులు ఏర్పాటు చేశారు. 544మంది డాక్టర్లు సహా 3,199మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. 38 పెద్ద అంబులెన్సులు, ట్రాఫిక్ జామ్ అయితే పేషెంట్ వద్దకే వెళ్లేలా 40 బైక్ అంబులెన్సులను సిద్ధం చేశారు.


