News June 12, 2024
T20WC: సూపర్ 8కు సౌతాఫ్రికా క్వాలిఫై

శ్రీలంక-నేపాల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో సౌతాఫ్రికా సూపర్ 8కు అర్హత సాధించింది. దీంతో సూపర్ 8కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఆ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడి అన్నింట్లోనూ గెలుపొందింది. దీంతో గ్రూప్ Dలో 6 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉంది. అలాగే ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఆ జట్టు మూడు మ్యాచులు ఆడి అన్నింట్లోనూ ఓటమిపాలైంది.
Similar News
News March 18, 2025
ఈడీకి చేరిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారం

TG: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఈడీ ఫోకస్ చేసింది. బెట్టింగ్ యాప్స్ చెల్లింపులపై, యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్ల సంపాదనపై ఆరా తీసింది. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను తెప్పించుకున్నట్లు సమాచారం. మనీ లాండరింగ్, హవాలా రూపంలో వారికి చెల్లింపులు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే <<15801067>>11 మంది<<>> ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని విచారణకు పిలిచారు.
News March 18, 2025
టెన్త్ అర్హత.. CISFలో 1,161 ఉద్యోగాలు

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 1,161 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టులకు ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, సంబంధిత ట్రేడ్‌లో ITI పాసైన 18-23 ఏళ్లలోపు వారు అర్హులు. PET, PST, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రూ.21,700-69,100 జీతం చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://cisfrectt.cisf.gov.in/
News March 18, 2025
Way2News Exclusive: టెన్త్ విద్యార్థులకు స్కామర్ల వల

AP: ఎలాగైనా టెన్త్ పాస్ కావాలనే విద్యార్థులను కొందరు దోచుకుంటున్నారు. డబ్బులిస్తే జరగబోయే పరీక్షల క్వశ్చన్ పేపర్లు పంపుతామని టెలిగ్రామ్ ఛానళ్లలో వల వేస్తున్నారు. దీంతో అమాయక స్టూడెంట్స్ పేమెంట్స్ చేస్తే ప్రొటెక్టెడ్ PDF పంపి, పాస్‌వర్డ్ కోసం మళ్లీ డబ్బు లాగుతున్నారు. ఇలాంటి స్కామర్లలో ఒకరితో స్టూడెంట్‌లా Way2News చాట్ చేసింది (పైన చాట్ ఫొటోలు). విద్యార్థులూ.. ఇలాంటి స్కామర్లను నమ్మకండి.
Share It