News May 17, 2024

T20WC జట్టు ఎంపికపై గతంలోనూ విమర్శలొచ్చాయి: జైషా

image

టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపికపై గతంలోనూ విమర్శలు వచ్చాయని BCCI సెక్రటరీ జైషా అన్నారు. ఈసారి సెలక్షన్ కమిటీ సమతూకమైన జట్టును ప్రకటించిందని, కేవలం IPL ఫామ్‌నే ప్రామాణికంగా తీసుకోకుండా.. విదేశాల్లో అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నామన్నారు. అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లను ఎంపిక చేశామన్నారు. కార్యదర్శిగా తన పాత్ర కేవలం సమాచారం ఇవ్వడమేనని, జట్టు ఎంపిక సెలక్షన్ కమిటీ నిర్ణయమన్నారు.

Similar News

News January 9, 2025

ట్రెండింగ్‌లో ‘లొట్టపీసు’.. అర్థం ఏంటంటే?

image

తనపై పెట్టిన కేసు ‘లొట్టపీసు’ అని KTR వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘లొట్టపీసు’ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీని అర్థం కోసం చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. కాగా, లొట్టపీసు అనేది కాలువలు, కుంటలు, చెరువుల్లో పెరిగే ఓ మొక్క. దీని కాండం తెల్లని పూతతో లొట్ట(లోపల ఖాళీగా, డొల్ల) మాదిరి ఉంటుంది. అందుకే దీనికి ‘లొట్టపీసు’ పేరు వచ్చింది. గ్రామీణ నేపథ్యమున్న వారికి ఇది సుపరిచితమైన పేరే.

News January 9, 2025

డిసెంబర్లో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల వరద

image

DECలో ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.41,155CR పెట్టుబడులు వచ్చాయి. NOVతో పోలిస్తే ఇది 14.5% వృద్ధి. వరుసగా 46వ నెలా ఈ ఫండ్స్‌ పాజిటివ్ జోన్లోనే ఉండటం విశేషం. NIFTY, SENSEX నష్టపోతున్నా థీమాటిక్/సెక్టోరల్ ఫండ్స్‌లో MoM పద్ధతిన రూ.15,331CR ఇన్‌ఫ్లో వచ్చింది. ఇక 12 NFOల్లో రూ.11,337CR, స్మాల్‌క్యాప్ కేటగిరీలో రూ.4667CR పెట్టుబడులు వచ్చాయి. డెట్ ఫండ్స్‌ నుంచి రూ.1.27L CR వెనక్కి తీసుకున్నారు.

News January 9, 2025

‘గేమ్ ఛేంజర్’ మిడ్‌నైట్ షోలు ఆపాలని పిటిషన్.. HC సెటైరికల్ రిప్లై

image

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మిడ్ నైట్ షోలను నిలిపివేయాలని కొందరు ఏపీ హైకోర్టు(HC)ను ఆశ్రయించారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు మరణించిన ఘటనను పేర్కొంటూ షోను నిలిపివేయాలని కోర్టును కోరారు. దీనికి ‘శ్రీహరికోట రాకెట్ ప్రయోగానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై వ్యక్తులు మరణిస్తే ప్రయోగాలు ఆపేయ్యాలి అన్నట్లుగా మీ అభ్యర్థన ఉంది’ అని హైకోర్టు వ్యంగ్యంగా స్పందించింది.