News June 1, 2024

T20WC: ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వీరులు వీరే!

image

రేపటి నుంచి T20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ధనాధన్ ఆటతో ఆటగాళ్లు ప్రేక్షకులను అలరించనున్నారు. T20 WCలో భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పేరిట ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు ఉంది. 2007 WCలో 12 బంతుల్లోనే యూవీ అర్ధసెంచరీ సాధించారు. ఆ తర్వాత మైబర్గ్ (17 బంతుల్లో), స్టొయినిస్ (17), మ్యాక్స్‌వెల్ (18), కేఎల్ రాహుల్ (18), షోయబ్ మాలిక్ (18) ఉన్నారు. ఈ WCలో ఎవరు ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొడతారో కామెంట్ చేయండి.

Similar News

News January 21, 2025

గుమ్మడి గింజలతో ఎంతో ఆరోగ్యం

image

గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని ప్రోటీన్, ఫైబర్, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతాయి. పండ్లు, ఆకుకూర సలాడ్లలో గుమ్మడికాయ గింజలను కలిపి తింటే ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. అలాగే జీర్ణక్రియ మెరుగవ్వడానికీ ఉపయోగపడతాయి. వీటిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే చర్మం నిగనిగలాడుతుందని వైద్యులు చెబుతున్నారు.

News January 21, 2025

దావోస్ వెళ్లి ఏం సాధిస్తారో కానీ..: అంబటి

image

AP: లోకేశ్ భవిష్యత్తులో సీఎం అవుతారని మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘దావోస్ వెళ్లి ఏం సాధిస్తారో కానీ.. లోకేశ్ ముఖ్యమంత్రి కావాలని వెల్లడించారు’ అని ట్వీట్ చేశారు. భరత్ వ్యాఖ్యలపై CM చంద్రబాబు సీరియస్ అయిన విషయం తెలిసిందే. లోకేశ్‌ను Dy.CM చేయాలన్న పలువురి నేతల వ్యాఖ్యలపై స్పందించిన అధిష్ఠానం వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని ఇప్పటికే ఆదేశించింది.

News January 21, 2025

కార్డియాక్ అరెస్ట్, హార్ట్ఎటాక్ మధ్య తేడా ఇదే!

image

చాలా మందికి ఈ రెండింటి మధ్య తేడా తెలియదు. కార్డియాక్ అరెస్ట్‌ వస్తే గుండె రక్తాన్ని పంప్ చేయడం ఆపుతుంది. అప్పుడు CPR చేయాలి. మెదడుకు రక్తాన్ని పంప్ చేయకపోవడంతో వ్యక్తి స్పృహ కోల్పోతాడు. హార్ట్ఎటాక్ వచ్చినప్పుడు గుండెకి రక్తం సరఫరా చేసే ధమనులు బ్లాక్ అవుతాయి. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఆ రోగికి యాంజియోప్లాస్టీ చేయాలి. చికిత్స చేయకపోతే అది కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుంది.