News May 15, 2024

T20WC: హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

image

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. జూన్ 29న ఫైనల్ మ్యాచ్ బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరగనుండగా 28 వేల టికెట్లు నిమిషాల వ్యవధిలో అమ్ముడయ్యాయి. రూ.500 నుంచి రూ.33 వేల వరకు ధర ఉన్న టికెట్లను క్రికెట్ అభిమానులు పోటీపడి కొనుగోలు చేశారు. ఈ మెగా టోర్నీ జూన్ 2 నుంచి ప్రారంభం కానుండగా అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News March 3, 2026

నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: సీఎం రేవంత్

image

TG: నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను CM రేవంత్ ఆదేశించారు. MAR 6 నుంచి JUNE 12 వరకు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై దిశానిర్దేశం చేశారు. ‘ప్రభుత్వ పథకాలు, విద్యా వ్యవస్థలో మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ ఆస్పత్రులను సమీప మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాలి. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతినెలా బిల్లులు సమయానికి చెల్లించాలి’ అని సూచించారు.

News March 3, 2026

చంద్రగ్రహణం.. నేరుగా చూడవచ్చా?

image

మన దేశంలో చంద్రగ్రహణం ఏర్పడింది. మ.3.20 గం.కు ఇది ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలవారు 6.20PM నుంచి చూడొచ్చు. 6.47PMకు గ్రహణం ముగుస్తుంది. చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడవచ్చని, ఎలాంటి ప్రత్యేక గ్లాసెస్ అవసరం లేదని సైంటిస్టులు వెల్లడించారు. సూర్యగ్రహణం మాదిరిగా ఇది ప్రమాదకరం కాదని, చంద్రకిరణాలు ఎలాంటి హాని చేయవని పేర్కొన్నారు.
Share It

News March 3, 2026

RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>RITES<<>> లిమిటెడ్‌ 5 అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech (సివిల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నేటి నుంచి మార్చి18 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ నెల 24, 25 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.50,721 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rites.com