News April 29, 2024

T20WC: ఈ నలుగురికి మొండిచేయి?

image

త్వరలో జరిగే T20WCకు జట్టును ఎంపిక చేసేందుకు BCCI కసరత్తులు చేస్తోంది. ఈనేపథ్యంలోనే ప్రస్తుత IPLలో ఆటగాళ్ల ప్రదర్శనలపై దృష్టి పెట్టింది. హార్దిక్, గిల్, సూర్యకుమార్, రింకూ సెలక్టర్లను ఆకట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు WC జట్టును ప్రకటించే గడువు సమీపిస్తోంది. మే 1న 15మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించాల్సి ఉంది. కాగా.. కెప్టెన్ రోహిత్, కోహ్లీ, బుమ్రా, కుల్దీప్ స్థానాలు ఖరారైనట్లు సమాచారం.

Similar News

News April 14, 2026

బిహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి

image

బిహార్ కొత్త సీఎంగా బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పేరు ఖరారైంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఆయనను అధికారికంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు భాగస్వామ్య పార్టీల అధినేతలు ఆయనకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. రేపు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా సీఎం పదవికి కాసేపటి క్రితం నితీశ్ కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

News April 14, 2026

రియల్ హీరో❤️

image

వేసవిలో పక్షులకు కాసిన్ని నీళ్లు పెట్టడానికే మనం విసుగు చెందుతాం. కానీ గుజరాత్ జూనాగఢ్‌కు చెందిన హర్సుఖ్‌భాయ్ వఘాసియా మాత్రం పదివేల పక్షులకు ‘అన్నదాత’గా మారారు. 28 ఏళ్ల క్రితం ఒక పిట్టతో మొదలైన ఆయన ప్రయాణం.. నేడు 4 ఎకరాల్లో 10వేల పక్షుల కడుపు నింపే స్థాయికి చేరింది. దీనికోసం ఆయన ఏటా ₹2 లక్షలు ఖర్చు చేస్తున్నారు. విలాసాలకు దూరంగా ఉంటూ మూగజీవాల సేవకే జీవితాన్ని అంకితం చేసిన వఘాసియా నిజమైన హీరో.

News April 14, 2026

‘త్రిశంకు స్వర్గం’ గురించి తెలుసా?

image

అటూ ఇటూ కాకుండా నిలిచిపోయిన పరిస్థితిని ఈ జాతీయంతో పోలుస్తాం. ఇక్ష్వాకు వంశ రాజు త్రిశంకుడికి మానవ శరీరంతోనే స్వర్గంలోకి వెళ్లాలని కోరిక. దానికోసం యజ్ఞం నిర్వహించాలని వశిష్ఠుడిని కోరగా తిరస్కరిస్తారు. విశ్వామిత్రుడు తన తపోశక్తితో ఆయనను స్వర్గ ద్వారం వద్దకు చేరుస్తారు. ఇంద్రుడు అడ్డుకోవడంతో త్రిశంకుడు భూమిపై పడిపోతుండగా విశ్వామిత్రుడు మరో స్వర్గాన్ని సృష్టిస్తారు. అదే త్రిశంకు స్వర్గం. <<-se>>#EPICSAYINGS<<>>