News June 13, 2024
T20WC: అసలేమైంది ఈ దిగ్గజ జట్లకు?

టీ20 WCలో పలు టాప్ టీమ్స్ పేలవ ప్రదర్శన చేస్తున్నాయి. న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితికి చేరాయి. ఆ టీమ్స్ సూపర్-8కు వెళ్లాలంటే ఇతర జట్లపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, అమెరికా వంటి చిన్న జట్లు అంచనాలకు మించి రాణిస్తున్నాయి. దీంతో ఈసారి ప్రపంచ కప్ పోటీలు రసవత్తరంగా మారాయి.
Similar News
News November 13, 2025
ఆగాకర సాగు.. ఇలా నాటితే ఎక్కువ ప్రయోజనం

ఆగాకరను విత్తనం, దుంపలు, తీగ కత్తిరింపుల ద్వారా ప్రవర్థనం చేస్తారు. 2-3 సంవత్సరాల వయసుగల దుంపలు నాటుటకు అనుకూలం. తీగ కత్తిరింపుల ద్వారా అయితే 2-3 నెలల వయసున్న తీగ కత్తిరింపులను ఎంచుకోవాలి. విత్తనం ద్వారా నాటుకోవాలంటే గుంతకు 4-5 విత్తనాలు నాటుకోవాలి. ఇవి పూతకు వచ్చినప్పుడు మగ మొక్కలను తీసి గుంతకు 2-3 ఆరోగ్యవంతమైన ఆడ మొక్కలను ఉంచాలి. దుంపల ద్వారా నాటడం రైతులకు శ్రేయస్కరం.
News November 13, 2025
స్వస్తివచనం ఎందుకు చేయాలి?

చేయబోయే పనులు విజయవంతం కావాలని, మనతో పాటు చుట్టూ ఉన్న అందరికీ మేలు కలగాలని కోరుతూ పలికే పవిత్ర ప్రార్థననే ‘స్వస్తి వచనం’ అంటారు. సంకల్పంతో కొన్ని ప్రార్థనలు చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. మన పనులకున్న అడ్డంకులు తొలగిపోతాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తే, ఆ సానుకూల శక్తి తిరిగి మనకే బలాన్నిస్తుంది. లక్ష్యాలకు విజయాన్ని చేరుస్తుంది. అందుకే ఏ కార్యాన్ని మొదలుపెట్టినా స్వస్తివచనం తప్పక ఆచరించాలి.
News November 13, 2025
ప్రెగ్నెన్సీలో జామపండ్లు తినొచ్చా?

జామపండ్లలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ బి6, పొటాషియం, ఫైబర్, లుటిన్ వంటి పోషకాలు ఉన్నాయి. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వీటిని తినడం వల్ల హైడ్రేటెడ్గా ఉండటంతో పాటు జెస్టేషనల్ డయాబెటీస్ రాకుండా ఉంటుంది. అలాగే శిశువులో నాడీలోపాలు రాకుండా, తల్లిలో యాంగ్జైటీ రాకుండా చూస్తుందని చెబుతున్నారు.


