News November 18, 2024

వారిపై చర్యలు తీసుకోండి.. రోజా ఫిర్యాదు

image

AP: మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి రోజా, ఆ పార్టీ నాయకులు తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఆపడానికి పోలీసులను వాడాలని, వైసీపీపై ప్రయోగిస్తే తిరుగుబాటు తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు అమలుచేయలేక సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Similar News

News October 16, 2025

జగన్ సొంత ఫోన్ నంబర్ ఇవ్వలేదు: సీబీఐ

image

AP: విదేశీ పర్యటనకు వెళ్లిన YCP చీఫ్ జగన్ తన సొంత ఫోన్ నంబర్ కాకుండా మరొకరిది ఇచ్చారని సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయన పర్యటన అనుమతిని రద్దు చేయాలని కోరారు. విదేశాలకు వెళ్లే ముందు తన ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ సహా పర్యటన వివరాలు ఇవ్వాలనే షరతులను జగన్ ఉల్లంఘించారని HYD సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.

News October 16, 2025

మేడారం పనులు R&Bకి బదిలీ

image

TG: మేడారం టెండర్లపై మంత్రుల మధ్య <<18018400>>వివాదం<<>> వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పనులను ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి R&B శాఖకు బదిలీ చేసింది. దేవాదాయ శాఖకు పనులను పర్యవేక్షించే సాంకేతికత లేదని, పనుల స్వభావం, నాణ్యత, నిర్ణీత సమయంలో పూర్తి చేయడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రికార్డులను R&Bకి అప్పగించాలని ఆదేశించింది. కొండా సురేఖ ఎండోమెంట్ మంత్రిగా ఉన్నారు.

News October 16, 2025

నేడు ఈశాన్య రుతుపవనాల ఆగమనం

image

ఇవాళ దక్షిణ భారతదేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు IMD పేర్కొంది. ఇదే రోజు నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు APలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు APSDMA పేర్కొంది. ఈ నెల 20కల్లా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD అంచనా వేసింది. అది వాయుగుండం లేదా తుఫానుగా మారే ప్రమాదముందని హెచ్చరించింది.