News November 18, 2024
వారిపై చర్యలు తీసుకోండి.. రోజా ఫిర్యాదు
AP: మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి రోజా, ఆ పార్టీ నాయకులు తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఆపడానికి పోలీసులను వాడాలని, వైసీపీపై ప్రయోగిస్తే తిరుగుబాటు తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు అమలుచేయలేక సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Similar News
News December 12, 2024
ప్రభుత్వ దుబారా ఖర్చుల వల్లే ద్రవ్యోల్బణం: మస్క్
అపరకుబేరుడు ఎలాన్ మస్క్ ద్రవ్యోల్బణంపై చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ప్రభుత్వాలు చేసే అధిక వ్యయమే ద్రవ్యోల్బణానికి కారణమవుతున్నాయి. ప్రభుత్వ దుబారా ఖర్చులను అరికడితే ద్రవ్యోల్బణం ఉండదు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. మస్క్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని, ప్రభుత్వాలు ప్రకటించే ఉచితాలనే చూస్తున్నామని, ధరల పెరుగుదలను పట్టించుకోవట్లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News December 12, 2024
నన్ను గొడ్డులా చావబాదేవాడు: అతుల్ భార్య
రూ.10 లక్షల వరకట్నం కోసం తనను తీవ్రంగా వేధించారని అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా ఆరోపించారు. తనకు వచ్చిన జీతం మొత్తం సుభాష్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునేవారని 2022లో పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌లో తెలిపారు ‘సుభాష్, ఆయన తల్లిదండ్రులు నన్ను శారీరకంగా, మానసికంగా వేధించారు. తాగొచ్చి గొడ్డును బాదినట్లు చావగొట్టేవారు. ఇదంతా చూసి తట్టుకోలేక మా నాన్న గుండెపోటుతో మరణించారు’ అని ఆమె పేర్కొన్నారు.
News December 12, 2024
T20 ఫార్మాట్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని బ్రాడ్‌కాస్టర్లు ఐసీసీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నామని వారు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. వన్డే ఫార్మాట్‌లో కాకుండా టీ20 ఫార్మాట్‌లో అయితే నష్టం వాటిల్లకుండా ఉంటుందని చెప్పినట్లు సమాచారం. దీనిపై ఐసీసీ కూడా పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది.