News November 19, 2024
LIC హిందీ వెబ్‌సైట్‌ను వెనక్కు తీసుకోండి: స్టాలిన్
హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాల్లో LIC ఓ ప్రచార సాధనంగా మారిందని TN CM స్టాలిన్ దుయ్యబట్టారు. LIC వెబ్సైట్ హిందీ వర్షన్ స్క్రీన్ షాట్‌ను ఆయన పోస్ట్ చేశారు. ఇంగ్లిష్‌ను ఎంపిక చేసుకొనే ఆప్షన్ కూడా హిందీలోనే ఉందని మండిపడ్డారు. ప్రతి భారతీయుడి సహకారంతో LIC వృద్ధి చెందిందని, మెజారిటీ వర్గాన్ని ద్రోహం చేయడానికి ఎంత ధైర్యమని నిలదీశారు. దీన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 19, 2024
రైల్వే ప్రయాణికులకు GOOD NEWS
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా 370 రైళ్లకు అదనంగా 1,000 జనరల్ బోగీలను చేర్చనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల రోజుకు అదనంగా లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని తెలిపింది. వచ్చే రెండేళ్లలో 10వేలకు పైగా కొత్త నాన్ ఏసీ జనరల్ కోచ్‌లను ప్రవేశపెడతామంది. ఇందులో 4వేల స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని పేర్కొంది.
News November 19, 2024
RGV ముందస్తు బెయిల్ పిటిషన్
తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం డైరెక్టర్ <<14581839>>ఆర్జీవీ<<>> AP హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా, వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా పోస్టులు పెట్టలేదని తెలిపారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను త్వరలోనే న్యాయస్థానం విచారించనుంది. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆయన పిటిషన్ దాఖలు చేయగా <<14642033>>కొట్టేసిన<<>> విషయం తెలిసిందే.
News November 19, 2024
లోకేశ్ చొరవతో అయ్యప్ప భక్తుల విడుదల
AP: జీడి నెల్లూరు నియోజకవర్గం గొడుగుచింతకు చెందిన అయ్యప్ప భక్తులు కేరళ వెళ్తుండగా వాహనానికి ప్రమాదం జరిగింది. అక్కడి పోలీసులు స్టేషన్లో ఉంచగా, తమను ఆదుకోవాలని వారు సోషల్ మీడియాలో మంత్రి లోకేశ్‌ను కోరారు. సురక్షితంగా తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. అక్కడి అధికారులతో లోకేశ్ టీం మాట్లాడగా, వారిని పోలీసులు విడిచిపెట్టారు. దీంతో అయ్యప్ప భక్తులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.