News November 19, 2024

LIC హిందీ వెబ్‌సైట్‌ను వెనక్కు తీసుకోండి: స్టాలిన్

image

హిందీని బ‌ల‌వంతంగా రుద్దే ప్ర‌య‌త్నాల్లో LIC ఓ ప్ర‌చార సాధ‌నంగా మారింద‌ని TN CM స్టాలిన్ దుయ్య‌బ‌ట్టారు. LIC వెబ్‌సైట్ హిందీ వ‌ర్ష‌న్ స్క్రీన్ షాట్‌ను ఆయన పోస్ట్ చేశారు. ఇంగ్లిష్‌ను ఎంపిక చేసుకొనే ఆప్ష‌న్ కూడా హిందీలోనే ఉంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌తి భార‌తీయుడి స‌హకారంతో LIC వృద్ధి చెందింద‌ని, మెజారిటీ వర్గాన్ని ద్రోహం చేయ‌డానికి ఎంత ధైర్యమ‌ని నిల‌దీశారు. దీన్ని వెన‌క్కు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Similar News

News December 10, 2024

మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు

image

మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని మోహన్‌బాబు వాట్సాప్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై కొడుకు మనోజ్, కోడలు మౌనికపై FIR నమోదైంది. తనపై దాడి చేశారని, ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్‌బాబుకు చెందిన 10 మంది అనుచరులపై పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 10, 2024

ప్రపంచంలో అత్యధికులు చదివేది ఇంగ్లిషే

image

ప్రపంచంలో 135 దేశాలవారు ఇంగ్లిష్‌లోనే చదువుకుంటున్నట్లు ‘డ్యులింగో లాంగ్వేజ్ రిపోర్ట్ 2024’ వెల్లడించింది. రెండో స్థానంలో స్పానిష్, మూడో ప్లేస్‌లో ఫ్రెంచ్ ఉన్నట్లు తెలిపింది. స్పానిష్‌ 33 దేశాల్లో, ఫ్రెంచ్‌ను 16 దేశాల్లో అభ్యసిస్తున్నట్లు వివరించింది. ప్రపంచంలో అత్యధిక మంది అభ్యసిస్తున్న పదో భాషగా హిందీ నిలిచింది. ఇంగ్లిష్ సర్టిఫికేషన్ కోర్సుకు ప్రాధాన్యమిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.

News December 10, 2024

జబర్దస్త్ టు క్యాబినెట్: నాడు రోజా, నేడు నాగబాబు

image

AP: రాష్ట్ర క్యాబినెట్‌లో నాగబాబు చేరిక ఖాయమైంది. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత 6 నెలల్లో MLCగా ఎన్నికవ్వాల్సి ఉంటుంది. జబర్దస్త్‌ కామెడీ షోలో జడ్జీలుగా చేసిన రోజా, నాగబాబు వేర్వేరు ప్రభుత్వాల్లో మంత్రులుగా అవకాశం దక్కించుకున్నట్లవుతుంది. అప్పట్లో వీరి మధ్య మంచి సంబంధాలే ఉండగా తర్వాత రాజకీయంగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.