News August 31, 2024

‘గుడ్లవల్లేరు’ ఘటనను సీరియస్‌గా తీసుకోండి: బొత్స

image

AP: <<13984448>>గుడ్లవల్లేరు<<>> ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని YCP MLC బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆడపిల్లల జీవితాలతో ముడిపడిన ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, లేదంటే ఇదో అలవాటుగా మారుతుందని చెప్పారు. విద్యాసంస్థల్లో ఇప్పటికే 9 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Similar News

News September 20, 2024

నెయ్యిలో నాణ్యత లేదు: టీటీడీ ఈఓ

image

AP: తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో నాణ్యతా లోపాన్ని తాను గమనించానని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. ‘నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు. రూ.320కి కల్తీ నెయ్యి మాత్రమే వస్తుంది. తక్కువ ధర కారణంగా నాణ్యత క్షీణిస్తుంది. నెయ్యి నాణ్యతపై పోటు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.75 లక్షలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటయ్యేది. కానీ గత ప్రభుత్వం ఆ పని చేయలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News September 20, 2024

చంద్రబాబు హిందూ జాతికి క్షమాపణలు చెప్పాలి: భూమన

image

AP: తిరుమల లడ్డూను వాడుకుని రాజకీయం చేద్దామనుకున్నCM చంద్రబాబు ప్రయత్నాలు బెడిసికొట్టాయని TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తక్షణమే CM హిందూ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘లడ్డూలో ఎడిబుల్ ఆయిల్ వాడుతున్నట్లు TTD EO శ్యామలరావు ప్రకటించారు. ఫేక్ రిపోర్టుతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

News September 20, 2024

YCPకి సామినేని ఉదయభాను రాజీనామా

image

AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, సరైన గుర్తింపు రాలేదని సామినేని అన్నారు. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికే రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా ఎల్లుండి ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు.