News September 22, 2024
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి: TTD ఈఓతో పవన్
AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని TTD ఈఓ శ్యామలరావును dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. భక్తుల మనోభావాలు, ధార్మిక అంశాల్లో రాజీ పడొద్దని తేల్చిచెప్పారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈఓతో పవన్ భేటీ అయ్యారు. కాగా గత ప్రభుత్వ హయాంలోనే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈఓ తెలిపారు. TTD తరఫున రేపు మహాశాంతి యాగం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Similar News
News October 11, 2024
జపాన్ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం
2024 ఏడాదికి గానూ నోబెల్ శాంతి బహుమతి జపనీస్ సంస్థ నిహాన్ హిడాంక్యోను వరించింది. అణ్వాయుధాల రహిత ప్రపంచం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేసినట్టు కమిటీ ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 111 మంది సభ్యులు, 31 సంస్థలను నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఈ ఏడాది పురస్కారానికి 286 నామినేషన్లను పరిశీలించిన కమిటీ నిహాన్ హిడాంక్యోను పురస్కారానికి ఎంపిక చేసింది.
News October 11, 2024
ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై శ్రుతి హాసన్ ఆగ్రహం
ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఆలస్యం కావడం పట్ల నటి శ్రుతి హాసన్ అసహనం వ్యక్తం చేశారు. ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ‘నేను సాధారణంగా ఫిర్యాదులు చేయను. ఇండిగో.. మీరు సేవల్లో ఎప్పటికప్పుడు దిగజారుతున్నారు. నాలుగు గంటలుగా ఎయిర్‌పోర్టులోనే మగ్గుతున్నాం. దీనిపై మీ నుంచి కనీస సమాచారం లేదు. మీ పాసింజర్ల కోసం మెరుగైన మార్గాల్ని అన్వేషించండి. ప్లీజ్’ అని కోరారు.
News October 11, 2024
గ్రూప్-3 ఉద్యోగాల భర్తీపై BIG UPDATE
తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షల తేదీలను TGPSC ప్రకటించింది. నవంబర్ 17, 18 తేదీల్లో OMR విధానంలో పేపర్-1,2,3 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షలకు వారం ముందు నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు పొందవచ్చని వెల్లడించింది. ఇప్పటికే శాంపిల్ OMR ఆన్సర్ షీటును వెబ్‌సైటులో అందుబాటులో ఉంచామంది.