News February 21, 2025
ప్రతిభావంతులు APలోనే అభివృద్ధి చెందుతారు: CBN

శ్రీకాకుళంలోని మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్‌కు వలసొచ్చి బుట్టలు నేస్తూ జీవిస్తోన్న ఓ వృద్ధుడి కథ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కదిలించింది. ‘ఈయన కథ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పనితీరుకి నిదర్శనం. అవకాశాల కోసం ఊరు వదిలిపెట్టడం బాధాకరం. హస్తకళలను నేను ఎంతో ఆరాధిస్తా. మన రాష్ట్రాన్ని పునర్నిర్మించి అవకాశాలు సృష్టిస్తాం. ఆయనలాంటి ప్రతిభావంతులు ఇక్కడే అభివృద్ధి చెందుతారు’ అని CBN ట్వీట్ చేశారు.
Similar News
News March 22, 2025
BREAKING: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

TG: ఏపీలో పొత్తు లేకపోతే చంద్రబాబు గెలిచేవారు కాదని BRS అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో తాము సింగిల్‌గానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు. కార్యకర్తలంతా ఒక్కో కేసీఆర్‌లా తయారవ్వాలి. మోదీ నా మెడపై కత్తిపెట్టినా నేను రాష్ట్రం కోసం వెనకడుగు వేయలేదు. ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే’ అని పేర్కొన్నారు.
News March 22, 2025
వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ అవార్డు

కేంద్ర ప్రభుత్వం 2025కు గాను జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించింది. ప్రఖ్యాత హిందీ రచయిత, కవి వినోద్ కుమార్ శుక్లా రచించిన ‘నౌకర్ కీ కమీజ్’ నవలను ఇందుకు ఎంపిక చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆయన 50 ఏళ్లుగా సాహిత్య సేవ చేస్తున్నారు.
News March 22, 2025
చరణ్ బర్త్ డే.. ‘నాయక్’ రీరిలీజ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘నాయక్’ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గత కొన్నిరోజులుగా ‘నాయక్’ రీరిలీజ్‌పై అభిమానుల నుంచి డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చరణ్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ తెరకెక్కించారు. ఈ చిత్రం 2013లో రిలీజవగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కాగా, ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు.