News November 21, 2024
ఒత్తిడిలో ఉన్నప్పుడు అమ్మతో మాట్లాడండి!
మార్కులంటూ విద్యార్థులు, టార్గెట్స్ అంటూ ఉద్యోగులూ నిత్యం ఒత్తిడికి లోనవుతూనే ఉంటారు. అయితే, అలాంటి సమయంలో తల్లితో మాట్లాడితే ఒత్తిడి మాయమైపోతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అమ్మకు దూరంగా ఉంటే ఫోన్ చేసి ఆమె వాయిస్ వినడం వల్ల స్ట్రెస్ తగ్గుతుందని తెలిపాయి. తల్లి స్వరం నుంచి కూడా ఆక్సిటోసిన్ విడుదలవుతుందని, దీనికి కౌగిలింత అవసరం లేదని పేర్కొన్నాయి. అందుకే ఒత్తిడిలో ఉన్నప్పుడు అమ్మతో మాట్లాడండి.
Similar News
News December 9, 2024
సిసోడియా నియోజకవర్గం అవధ్ ఓజాకు
Febలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆప్ 2వ జాబితాను విడుదల చేసింది. పట్పర్‌గంజ్ MLA, సీనియర్ నేత మనీశ్ సిసోడియా ఈసారి జాంగ్‌పురా నుంచి బరిలో దిగనున్నారు. ఇటీవల పార్టీలో చేరిన సివిల్స్ కోచింగ్ ఫ్యాకల్టీ అవధ్ ఓజా పట్పర్‌గంజ్ నుంచి పోటీ చేయనున్నారు. మొదటి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 20 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆప్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది.
News December 9, 2024
జైపూర్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజస్థాన్‌లోని జైపూర్ వెళ్లనున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన ఈనెల 11, 12, 13 తేదీల్లో అక్కడ పర్యటిస్తారు. కాగా సెక్రటేరియట్ ప్రాంగణంలో ఇవాళ సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు.
News December 9, 2024
గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల
TG: ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించబోయే గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను TGPSC విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 15వ తేదీ ఉ.9 గంటల వరకు కమిషన్ <