News September 26, 2024
‘దేవర’ విజయం పొందాలని తమన్ ట్వీట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా భారీ విజయాన్ని పొందాలని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆకాంక్షించారు. ‘నా ప్రియమైన తారక్ అన్నకు బెస్ట్ విషెస్. నా సోదరుడు అనిరుధ్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. రత్నవేలు చిత్రీకరించిన బెస్ట్ విజువల్స్‌కు అదిరిపోయే బీజీఎం లభించిందని అనుకుంటున్నా. తాను ఊహించుకున్న ప్రపంచాన్ని కొరటాల చాలా బాగా తెరకెక్కించారు. AMBలో FDFSలో కలుద్దాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 11, 2024
నందిగం సురేశ్‌కు అస్వస్థత
AP: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. లో బీపీ, భుజం, ఛాతీలో నొప్పి వస్తున్నట్లు ఆయన చెప్పడంతో జైలు అధికారులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసు, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్‌కు న్యాయస్థానం రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
News October 11, 2024
డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేజ్రీవాల్
అధికారంలోకొస్తే ఏడాదిలోపు విద్యుత్ ఛార్జీలను సగానికి తగ్గిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై EX CM కేజ్రీవాల్ స్పందించారు. ‘ఉచితాలు అమెరికా వరకు చేరుకున్నాయి’ అని ట్వీట్ చేశారు. అయితే, NDA పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అమలు చేస్తే BJP తరఫున ప్రచారం చేస్తానని కేజ్రీవాల్ ఇటీవల సవాల్ విసిరారు. తాజాగా ట్రంప్ ప్రకటనపై స్పందించడం వెనుక ఆయన BJPని టార్గెట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.
News October 11, 2024
జపాన్ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం
2024 ఏడాదికి గానూ నోబెల్ శాంతి బహుమతి జపనీస్ సంస్థ నిహాన్ హిడాంక్యోను వరించింది. అణ్వాయుధాల రహిత ప్రపంచం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేసినట్టు కమిటీ ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 111 మంది సభ్యులు, 31 సంస్థలను నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఈ ఏడాది పురస్కారానికి 286 నామినేషన్లను పరిశీలించిన కమిటీ నిహాన్ హిడాంక్యోను పురస్కారానికి ఎంపిక చేసింది.