News July 19, 2024
తమన్నా ఉంటే సినిమా హిట్టు.. తమిళ నటుడు క్షమాపణలు
సినిమాలో తమన్నా ఉంటే చాలు కథ లేకపోయినా హిట్ అవుతుందని తమిళ నటుడు పార్తిబన్ చేసిన వ్యాఖ్యలను పలువురు తప్పుబట్టారు. అయితే తానెవ్వరిని తక్కువ చేసే ఉద్దేశంతో మాట్లాడలేదని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఎవరినైనా ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించమని కోరారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు హీరోయిన్ డాన్స్ కోసమే సినిమా చూస్తున్నారని ఇటీవల ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. పార్తిబన్ తెలుగులో ‘రచ్చ’ మూవీలో నటించారు.
Similar News
News December 12, 2024
బౌన్సర్లు ఎవరిపైనైనా దాడులు చేయొచ్చా?
ప్రస్తుతం బౌన్సర్ల వినియోగం పెరిగిపోతోంది. హోటళ్లు, పబ్బులు, మాల్స్, ఈవెంట్లలో జనాన్ని అదుపు చేసేందుకు వీరిని ఉపయోగిస్తుంటారు. కొందరు బౌన్సర్లు భద్రత పేరుతో అడ్డొచ్చిన వారిపై దాడులు చేస్తున్నారు. పస్రా చట్టం ప్రకారం ఇతరులపై దాడులు చేయడానికి వీరికి హక్కు లేదు. వారు దాడి చేస్తే కేసు పెట్టొచ్చు. బౌన్సర్లకు కచ్చితంగా PSLN నంబర్, కోడ్ ఉండాలి. బౌన్సర్ల వ్యవస్థ ఉండాలా వద్దా అనేదానిపై మీ కామెంట్.
News December 12, 2024
రేవంత్.. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా?: KTR
TG: అర్ధసత్యాలు, అభూత కల్పనలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని CM రేవంత్‌ని KTR ప్రశ్నించారు. ‘మీ మాటలు అబద్ధం, మీ చేతలు అబద్ధం. కాకిలెక్కలతో మోసగించడమే మీ విధానమా? రూ.50-65వేల కోట్ల వడ్డీలు అని అవాస్తవాల వల్లింపు ఎవరికోసం? ఢిల్లీకి మూటలు మోసేందుకా? నీ జేబు నింపుకునేందుకా? అబద్ధానికి అంగీ, లాగు వేస్తే రేవంత్ అని మళ్లీ నిరూపించుకున్నారు. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా?’ అని ఫైర్ అయ్యారు.
News December 12, 2024
వారిపై చట్టపరమైన చర్యలు: సాయిపల్లవి
తనపై వస్తోన్న రూమర్స్‌పై హీరోయిన్ సాయిపల్లవి ఘాటుగా స్పందించారు. నిరాధారమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. తన మౌనాన్ని అవకాశంగా తీసుకోవద్దని ట్వీట్ చేశారు. కాగా ‘రామాయణ’లో సీత పాత్ర చేసేందుకు సాయిపల్లవి తన అలవాట్లు, పద్ధతులు మార్చుకున్నారంటూ ఓ తమిళ వెబ్‌సైట్ కథనాలు ప్రచురించింది. దానిపై ఆమె ఈ విధంగా స్పందించారు.