News June 28, 2024

పాఠ్యాంశంగా తమన్నా జీవితం.. తీవ్ర విమర్శలు

image

బెంగళూరులోని హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల 7వ తరగతి పుస్తకాల్లో నటి తమన్నా, రణ్‌వీర్ సింగ్‌ల గురించి పాఠ్యాంశాన్ని చేర్చడంపై వివాదం నెలకొంది. సింధీ వర్గంలో ఎంతోమంది కళాకారులున్నారని, సినిమాల్లో అర్ధ నగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు. అయితే సింధీ వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతోనే ఇలా చేశామని యాజమాన్యం అంటోంది.

Similar News

News December 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 11, 2024

మోహన్‌బాబు బౌన్సర్ల బైండోవర్‌కు ఆదేశం

image

TG: హైదరాబాద్ జల్‌పల్లిలో మోహన్‌బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్‌శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి రేపు ఉదయం విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్‌కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

News December 11, 2024

డిసెంబర్ 11: చరిత్రలో ఈ రోజు

image

* 1922: సినీ నటుడు దిలీప్ కుమార్ జననం
* 1931: భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో జననం
* 1953: UNICEF ఏర్పాటు
* 1969: చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జననం
* 1995: హీరోయిన్ నబా నటేష్ జననం
* 2004: MS సుబ్బలక్ష్మీ(ఫొటోలో) మరణం
* 2012: సితార్ వాయిద్యకారుడు రవిశంకర్ మరణం
* అంతర్జాతీయ పర్వత దినోత్సవం