News June 13, 2024
తమిళ నటుడు అనుమానాస్పద మృతి
తమిళ నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం పాలవక్కంలోని తన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. రెండ్రోజులుగా ఫోన్ తీయకపోవడంతో అతని మిత్రుడు ప్రదీప్ ఇంటికి వెళ్లి చూడగా ఆయన చనిపోయిన విషయం తెలిసింది. తలకు బలమైన గాయం తగలడం లేదా గుండెపోటుతో మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విలన్, కమెడియన్‌గా అలరించిన ప్రదీప్.. టెడ్డీ, ఇరుంబు తిరై, లిఫ్ట్, ఆడై వంటి సినిమాల్లో నటించారు.
Similar News
News September 10, 2024
పంత్ టెస్ట్ క్రికెట్ దిగ్గజం అవుతాడు: గంగూలీ
టీమ్ ఇండియాలో ప్రస్తుతమున్న అత్యుత్తమ టెస్టు బ్యాటర్లలో రిషభ్ పంత్ కూడా ఒకడని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. బంగ్లాతో టెస్టులకు పంత్ ఎంపికైన నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘రిషభ్ తిరిగి జట్టులోకి రావడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. మున్ముందు భారత్ టెస్టు ఆటగాళ్లలో తను ఓ దిగ్గజమవుతాడు. పొట్టి ఫార్మాట్లలో మాత్రం పంత్ మరింత మెరుగవ్వాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.
News September 10, 2024
ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ హోదానా? సిగ్గు.. సిగ్గు: KTR
TG: ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన <<14061145>>పీఏసీ ఛైర్మన్ <<>>పదవిని, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి? అని కేటీఆర్ నిలదీశారు. ‘పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం. గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోంది. పార్లమెంట్‌లో పీఏసీ ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్‌కు కట్టబెట్టిన విషయం మరిచారా?’ అని Xలో కేటీఆర్ ప్రశ్నించారు.
News September 9, 2024
రేపు వర్షాలు ఉన్నాయా?
రేపు ఉ.8.30 గంటల వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ADB, నిర్మల్, NZB, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. HYD సహా మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు ఏపీలో శ్రీకాకుళం, VZM, మన్యం, అల్లూరి, తూ.గో. జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.