News September 14, 2024

కష్టాల్లో తమిళ సినిమా?

image

తమిళ సినిమాకు ప్రస్తుతం అత్యంత కష్టమైన దశ నడుస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలకు స్టార్స్ పెద్దగా ప్రాముఖ్యతనివ్వకపోవడమే ఇందుక్కారణం. విజయ్ మరో సినిమా తర్వాత రిటైర్ అవుతుండగా, అజిత్ సినిమాలపై ఆసక్తి చూపించడం లేదు. రజినీకాంత్ చాలా తక్కువ సినిమాలు చేస్తుండగా సూర్య, విక్రమ్‌కు చాలాకాలంగా కమర్షియల్‌ హిట్స్ లేవు. జనాన్ని లాగే స్టార్ పవర్ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి.

Similar News

News October 5, 2024

శబరిమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్

image

శబరిమల దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న భక్తులకే దర్శనం కల్పిస్తామని, అది కూడా రోజుకు 80వేల మందికే అనుమతి ఉంటుందని తెలిపింది. అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే మకరవిళక్కు సీజన్ మరో నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. శబరిమల వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.

News October 5, 2024

రూ.10 కాయిన్లు తీసుకోండి: SBI

image

రూ.10 కాయిన్స్‌ చెల్లడం లేదనే అపోహతో చాలామంది తీసుకోవడం లేదు. ఈ అపోహ తొలగించాలనే లక్ష్యంతో SBI వరంగల్ జోనల్ కార్యాలయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సమన్వయంతో ప్రజలు, వ్యాపారుల్లో అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంకు అధికారులు వ్యాపారులకు, ప్రజలకు రూ.10 నాణేలను పంపిణీ చేశారు. ₹10 కాయిన్స్ చెల్లుతాయని అందరూ స్వీకరించాలని కోరారు.

News October 5, 2024

దేశంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభ‌వం!

image

కాంగ్రెస్ పార్టీకి పూర్వ‌వైభవం ప్రారంభమైనట్టేనని హరియాణా, JK ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలుపొందిన ఆ పార్టీ బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఈ అంచనాలు గనుక నిజమైతే దేశంలో కాంగ్రెస్ మరింత పుంజుకోవడం ఖాయమని పేర్కొంటున్నారు.