News June 28, 2024

NEET రద్దుపై తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

image

NEETను రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. నీట్‌కు వ్యతిరేకంగా DMK పోరాటం కొనసాగుతుందని, ఈ బిల్లును కేంద్రం ఆమోదించాలని CM స్టాలిన్ అన్నారు. చర్చ సందర్భంగా BJP MLA నాగేంద్రన్ తీర్మానాన్ని వ్యతిరేకించారు. NEETను తీసుకొచ్చింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు.

Similar News

News September 20, 2024

బుమ్రా @ది వరల్డ్ క్లాస్ ప్లేయర్!

image

చెన్నై వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో టీమ్ఇండియా పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పడగొట్టిన నాలుగు వికెట్లు బంగ్లాను తక్కువ మొత్తానికే ఆలౌట్ చేసేందుకు తోడ్పడ్డాయి. సొంతగడ్డపై బుమ్రా ఇప్పటివరకు 9 టెస్టులు ఆడగా 15.94 సగటు& 32.4 స్ట్రైక్ రేట్‌తో 37 వికెట్లు తీశారు. ప్రపంచ క్రికెట్‌లో బుమ్రా అత్యుత్తమ ఆటగాడని మరోసారి నిరూపించాడని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.

News September 20, 2024

నేటి కాంగ్రెస్‌లో దేశభక్తి స్ఫూర్తి చచ్చిపోయింది: మోదీ

image

విదేశీ గ‌డ్డ‌పై దేశాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. నేటి కాంగ్రెస్‌లో దేశ‌భ‌క్తి స్ఫూర్తి చ‌చ్చిపోయింద‌ని ఆయన మండిపడ్డారు. ‘పరాయి గడ్డపై కాంగ్రెస్ వాళ్ల భాష, దేశ వ్యతిరేక ఎజెండా, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే మాట‌ల‌ను చూడండి. ఇది ‘తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బ‌న్ న‌క్స‌ల్స్ న‌డుపుతున్న కాంగ్రెస్’ అంటూ ప్ర‌ధాని మండిప‌డ్డారు. మ‌హారాష్ట్ర‌లోని వార్ధ సభలో ఆయ‌న‌ మాట్లాడారు.

News September 20, 2024

పవన్.. ఎందుకు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు?: ప్రకాశ్ రాజ్

image

తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ చేసిన ట్వీట్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. ‘మీరు DCMగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఇష్యూ ఇది. దర్యాప్తు చేయండి. నేరస్థులు దొరికితే కఠిన చర్యలు తీసుకోండి. అంతేగానీ ఎందుకు ఊహాగానాల్ని వ్యాప్తి చేస్తున్నారు? కేంద్రంలో మీ స్నేహితుల వల్ల దేశంలో మనకున్న మతకల్లోలాలు చాలు’ అని ట్వీట్ చేశారు. దీంతో ఆయనపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.