News September 20, 2024
పవన్.. ఎందుకు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు?: ప్రకాశ్ రాజ్
తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. ‘మీరు DCMగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఇష్యూ ఇది. దర్యాప్తు చేయండి. నేరస్థులు దొరికితే కఠిన చర్యలు తీసుకోండి. అంతేగానీ ఎందుకు ఊహాగానాల్ని వ్యాప్తి చేస్తున్నారు? కేంద్రంలో మీ స్నేహితుల వల్ల దేశంలో మనకున్న మతకల్లోలాలు చాలు’ అని ట్వీట్ చేశారు. దీంతో ఆయనపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.
Similar News
News October 10, 2024
ఈ విషయంలో ప్రపంచ దేశాల కంటే భారత్ ఉత్తమం
భారత ఆహార వినియోగ విధానాలు ఉత్తమమని WWF లివింగ్ ప్లానెట్ నివేదిక పేర్కొంది. ప్రపంచ దేశాలు ఈ విధానాలను అనుసరిస్తే 2050 నాటికి ఆహార ఉత్పత్తి కోసం తక్కువ స్థాయిలో భూమి వాతావరణం దెబ్బతింటుందని పేర్కొంది. తద్వారా ఒకటికంటే తక్కువ భూభాగంలోనే మానవాళికి అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయవచ్చంది. అర్జెంటీనా, AUS, US, బ్రెజిల్ దేశాల ఆహార వినియోగ పద్ధతులను నివేదిక ఆక్షేపించింది.
News October 10, 2024
వారంలో రూ.7,500 కోట్ల డ్రగ్స్ సీజ్
దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ కార్యకలాపాలపై స్పెషల్ సెల్ ఉక్కుపాదం మోపుతోంది. వారం వ్యవధిలోనే రూ.7,500 కోట్ల విలువైన 762 కేజీల కొకైన్‌ను సీజ్ చేసింది. ఇటీవల 560 కేజీల డ్రగ్స్‌ను సీజ్ చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. ఇవాళ 200 కేజీల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని పలువురిని అరెస్ట్ చేసింది.
News October 10, 2024
ఏపీ మద్యం షాపులకు విదేశాల నుంచి దరఖాస్తులు
AP: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ రేపు రాత్రి 7 గంటలతో ముగియనుంది. షాపులకు అమెరికా, యూరప్ దేశాల నుంచి కూడా దరఖాస్తులు వస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య వెల్లడించారు. అమెరికా నుంచి అత్యధికంగా 20 దరఖాస్తులు వచ్చాయన్నారు. కాగా నిన్నటి వరకు 57 వేల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1,154 కోట్ల ఆదాయం వచ్చింది.