News March 18, 2024
తమిళిసై పొలిటికల్ రీఎంట్రీ.. కలిసొచ్చేనా?

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈమె 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకూడి నుంచి BJP తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే మూడు సార్లు అసెంబ్లీ బరిలో నిలిచినా గెలుపు దక్కలేదు. ఆమె సేవలను గుర్తించిన బీజేపీ అధిష్ఠానం 2019లో గవర్నర్ పదవిని కట్టబెట్టింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారైనా కలిసొస్తుందేమో చూడాలి.
Similar News
News January 26, 2026
ఇంట్లో ఫారిన్ కరెన్సీ ఎంత ఉంచుకోవచ్చు?

ఇంట్లో విదేశీ కరెన్సీ నోట్లు ఉంచుకోవడానికి పరిమితి ఉంది. RBI&FEMA నిబంధనల ప్రకారం ఎలాంటి కాల పరిమితి లేకుండా USD 2,000 (లేదా దానికి సమానమైన విదేశీ కరెన్సీ) నోట్లు, ట్రావెలర్స్ చెక్స్ ఉంచుకోవచ్చు. ఒకవేళ అంతకు మించితే 180 రోజుల్లోగా అధికారిక డీలర్(బ్యాంక్) ద్వారా సరెండర్ చేయాలి లేదా RFC అకౌంట్లో జమ చేయాలి. విదేశీ నాణేలపై ఎలాంటి పరిమితి లేదు. అన్‌లిమిటెడ్‌గా ఉంచుకోవచ్చు.
News January 26, 2026
అమెరికాకు చైనా అణు రహస్యాలు లీక్?

చైనా మిలిటరీ ఆఫీసర్ జనరల్ జాంగ్ యూక్సియా తమ దేశ అణు ఆయుధాల టెక్నికల్ డేటాను USకి లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. దీనిపై చైనా రక్షణ శాఖ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. షీ జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జాంగ్ యూక్సియాపై ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.
News January 26, 2026
ప్చ్ శాంసన్.. 9 ఇన్నింగ్స్‌లలో 104 పరుగులు

టీ20Iల్లో ఓపెనర్‌గా సంజూ శాంసన్ ఫెయిల్యూర్ కొనసాగుతోంది. 2025 జూన్ నుంచి 9 ఇన్నింగ్స్‌లలో 104 పరుగులు (Avg 11.55, SR 133.33) మాత్రమే చేశారు. వీటిలో ఒక్కసారి మాత్రమే పవర్ ప్లేలో నాటౌట్‌గా నిలిచారు. ఈ 9 ఇన్నింగ్స్‌ల స్కోర్లు 26(20), 5(7), 3(6), 1(3), 16(7), 37(22), 10(7), 6(5), 0(1)గా ఉన్నాయి. తాజాగా NZ సిరీస్‌లో ఫెయిల్ అవుతుండటంతో తుది జట్టులో ఆయనకు స్థానం దక్కే అవకాశాలు క్రమంగా తగ్గిపోతున్నాయి.


