News March 18, 2024
తమిళిసై పొలిటికల్ రీఎంట్రీ.. కలిసొచ్చేనా?

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈమె 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకూడి నుంచి BJP తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే మూడు సార్లు అసెంబ్లీ బరిలో నిలిచినా గెలుపు దక్కలేదు. ఆమె సేవలను గుర్తించిన బీజేపీ అధిష్ఠానం 2019లో గవర్నర్ పదవిని కట్టబెట్టింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారైనా కలిసొస్తుందేమో చూడాలి.
Similar News
News April 12, 2026
11AMకు ఇంటర్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

TG: ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రిజల్ట్స్ ఇవాళ విడుదల కాబోతున్నాయి. ఉ.11 గం.కు ప్రభుత్వ సలహాదారు K.కేశవరావు ఫలితాలు రిలీజ్ చేయబోతున్నారు. Way2Newsలో అత్యంత వేగంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఎలాంటి యాడ్స్ లేకుండా క్షణాల్లో మార్కులు వచ్చేస్తాయి. వాటిని ఈజీగా మీ సన్నిహితులకు షేర్ చేసుకోవచ్చు.
News April 12, 2026
మార్నింగ్ నుంచి హుషారుగా ఉండాలంటే..

*నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరం ఉత్తేజమవుతుంది. జీర్ణ సమస్యలు తొలగుతాయి.
*రోజూ 20-30 ని.ల పాటు యోగా, వాకింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
*పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం తీసుకుంటే శక్తి లభిస్తుంది. నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి.
*ఎండలో కాసేపు గడపడం వల్ల విటమిన్ D అందుతుంది.
*పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టాలి.
News April 12, 2026
2 ఏళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు బ్యాన్!

2 ఏళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్‌లను ప్రిస్క్రిప్షన్‌లో రాయకుండా నిషేధించాలని కేంద్రం భావిస్తోంది. ఐదేళ్ల పిల్లలకూ వాటి వాడకాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ రిలీజ్ చేసిన నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా-2026 ముసాయిదాలో భాగంగా ఈ చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గతేడాది దగ్గు మందు వల్ల పిల్లలు <<17944156>>చనిపోవడం<<>>, సిరప్‌లో హానికర రసాయనాలు ఉన్నట్లు తేలడం తెలిసిందే.


