News October 8, 2024
టమాటా తెచ్చిన తంటా.. 250 కి.మీ వెంబడించి!
ప్రస్తుతం టమాటా ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడిదే రైతులు, వ్యాపారస్థుల పాలిట శాపంగా మారింది. కర్ణాటకలోని ములుబాగల్‌కు చెందిన ఓ ట్రక్ డ్రైవర్ హైదరాబాద్‌లో టమాటాలు విక్రయించి తిరుగుపయనమయ్యాడు. కర్నూలు సమీపంలో టీ తాగేందుకు ట్రక్ ఆపగా ఓ దొంగల ముఠా టమాటా విక్రయించి వస్తున్న విషయం తెలుసుకుంది. 250 కి.మీ వెంబడించి సోమందేపల్లి వద్ద ట్రక్‌ను ఆపి రూ.5 లక్షలతోపాటు సెల్ ఫోన్ కూడా లాక్కెళ్లిపోయారు.
Similar News
News November 4, 2024
కేంద్రంలోకి CBN.. లోకేశ్‌ను సీఎం చేసే ప్రయత్నమా?: ఎంపీ VSR
AP: జమిలి ఎన్నికలు 2027లోనే వస్తాయనే ప్రచారం నేపథ్యంలో రాష్ట్రాన్ని దోచుకోవడంలో TDP నిమగ్నమైందా? అని MP విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ‘అవినీతి సొమ్ము పంచుకోవడంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలతో 5 నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. మతిమరుపు వ్యాధితో సతమతమవుతున్న చంద్రబాబు కొడుకు లోకేశ్‌ను CM చేసే ప్రయత్నంలో ఉన్నారా? చంద్రబాబు కేంద్రంలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారా?’ అని Xలో రాసుకొచ్చారు.
News November 4, 2024
గుడ్‌న్యూస్.. వారికి వచ్చేనెల 2 పెన్షన్లు!
AP: ఒకేసారి 3 నెలల పింఛన్ తీసుకోవచ్చన్న CM చంద్రబాబు <<14507352>>ప్రకటన<<>> నేపథ్యంలో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇకపై ఒకనెల పింఛన్ తీసుకోకపోతే మరుసటి నెలలో 2, రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలో మొత్తం కలిపి అందజేస్తారు. డిసెంబర్ నుంచే దీన్ని అమలు చేయాలని చూస్తున్నారు. నవంబర్‌లో పింఛన్ తీసుకోనివారికి డిసెంబర్ 1న రెండు నెలలది కలిపి ఇస్తారు. NOVలో వివిధ కారణాలతో 45వేల మంది పెన్షన్ తీసుకోలేదని గుర్తించారు.
News November 4, 2024
టెట్ ఫలితాలు.. సందేహాలుంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
AP: రాష్ట్రంలో టెట్‌కు 3,68,661 మంది హాజరవగా 1,87,256 మంది <<14524941>>ఉత్తీర్ణత<<>> సాధించారు. వారందరికీ మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే మెగా డీఎస్సీ విడుదల చేస్తామని ప్రకటించారు. అభ్యర్థులకు సందేహాలుంటే ఉ.11.30 నుంచి సా.5.30 వరకు 9398810958, 7995649286, 6281704160, 7995789286 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.