News March 19, 2024
టీసీఎస్‌లో టాటా సన్స్ వాటా విక్రయం?

తమ సాఫ్ట్వేర్ విభాగమైన టీసీఎస్‌లో 0.64 శాతం వాటాను టాటా సన్స్ విక్రయించనున్నట్లు తెలుస్తోంది. అందుకు సమానమైన 2.3 కోట్ల షేర్లను ఒక్కొక్కటి రూ.4001 చొప్పున బ్లాక్ డీల్స్ ద్వారా అమ్మే అవకాశం ఉందని సంస్థ వర్గాలు తెలిపాయి. దీంతో రూ.9202 కోట్లకు పైగా నిధులను సమకూర్చుకోనుంది. గత డిసెంబరు నాటికి టీసీఎస్‌లో టాటా సన్స్‌కు 72.38శాతం వాటా ఉంది. వచ్చే ఏడాది సెప్టెంబరుకల్లా ఆ సంస్థ ఐపీఓకు రావొచ్చని అంచనా.
Similar News
News August 27, 2025
సినిమా ముచ్చట్లు

* సెప్టెంబర్ 19న ‘పౌర్ణమి’ రీరిలీజ్
* ‘మిరాయ్’ ఓటీటీ పార్ట్నర్గా జియో హాట్‌స్టార్
* షారుఖ్, దీపికాలపై కేసు నమోదుకు భరత్పూర్ కోర్టు ఆదేశం
* ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల
* ‘ఘాటీ’ ప్రమోషన్లకు అనుష్క శెట్టి దూరం
News August 27, 2025
పండగ వేళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

వినాయక చవితి వేళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.380 పెరిగి రూ.1,02,440కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.350 ఎగబాకి రూ.93,900 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. KG సిల్వర్ రేట్ రూ.1,30,000గా ఉంది.
News August 27, 2025
తీవ్ర అల్పపీడనం.. బయటికి రావొద్దని హెచ్చరిక

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిందని APSDMA తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ప.గో, తూ.గో, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. వినాయక మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని పేర్కొంది.