News March 19, 2024
టీసీఎస్‌లో టాటా సన్స్ వాటా విక్రయం?

తమ సాఫ్ట్‌వేర్ విభాగమైన టీసీఎస్‌లో 0.64 శాతం వాటాను టాటా సన్స్ విక్రయించనున్నట్లు తెలుస్తోంది. అందుకు సమానమైన 2.3 కోట్ల షేర్లను ఒక్కొక్కటి రూ.4001 చొప్పున బ్లాక్ డీల్స్ ద్వారా అమ్మే అవకాశం ఉందని సంస్థ వర్గాలు తెలిపాయి. దీంతో రూ.9202 కోట్లకు పైగా నిధులను సమకూర్చుకోనుంది. గత డిసెంబరు నాటికి టీసీఎస్‌లో టాటా సన్స్‌కు 72.38శాతం వాటా ఉంది. వచ్చే ఏడాది సెప్టెంబరుకల్లా ఆ సంస్థ ఐపీఓకు రావొచ్చని అంచనా.
Similar News
News February 11, 2026
శివుడు లేని చోటు గలదా?

ఓ సముద్రంలో పుట్టిన అల, తను సముద్రం కంటే వేరు అనుకుంటుంది. అందుకే ప్రతిసారి ఉవ్వెత్తున ఎగసి ఒడ్డుకు వస్తుంది. కానీ అలకు మూలం, ఆధారం, అంతం ఆ సముద్రమే! అలాగే ఈ జగత్తులో మనం చూసే ప్రతి రూపం ఆ మహాశివుడనే సముద్రంలో పుట్టిన చిన్న అల మాత్రమే. రూపం చూస్తే అది మనిషిలాగో లేదా రాయిలాగో కనిపిస్తుంది. కానీ దాని సారాన్ని చూస్తేనే అది శివతత్వం అని అర్థమవుతుంది. సర్వం శివమే అని నమ్మితే ఆయన అనుగ్రహం కలుగుతుంది.
News February 11, 2026
న్యూజిలాండ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం

T20 WCలో వరుస విజయాలతో జోరు మీదున్న న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యారు. ఆదివారం వార్మప్ సమయంలో అతను గాయపడినట్లు న్యూజిలాండ్ క్రికెట్(NZC) తెలిపింది. బ్రేస్‌వెల్ స్థానంలో కోల్ మెక్‌కాంచీ రిజర్వ్ బౌలర్ బెన్ సియర్స్‌తో కలిసి జట్టులో చేరనున్నట్లు పేర్కొంది. న్యూజిలాండ్ తన మూడో మ్యాచ్ ఈ నెల 14న దక్షిణాఫ్రికాతో ఆడనుంది.
News February 11, 2026
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారా?

TG: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు మార్చి 1 నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు HYD పోలీసులు తెలిపారు. DL లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తించదని పేర్కొన్నారు. లైసెన్స్ లేనివారు RTA కార్యాలయం నుంచి తీసుకోవాలని సూచించారు.
* మైనర్లకు వాహనం ఇవ్వకపోవడం ఉత్తమం.


