News November 11, 2024

‘విస్తారా’కు టాటా..!

image

టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ‘విస్తారా’ ఇండియాలో తన చివరి విమాన సర్వీసును పూర్తి చేసింది. ఈ కంపెనీ ఎయిర్ ఇండియాలో విలీనం కావడంతో ఆ బ్రాండ్ ఇవాళ్టితో మన దేశంలో కనుమరుగు అవ్వనుంది. రేపటి నుంచి విస్తారా విమానాలు కూడా ఎయిర్ ఇండియా పేరుతో నడుస్తాయి. ఇక నుంచి తమ వెబ్‌సైట్‌ అందుబాటులో ఉండదని, రేపటి నుంచి http://airindia.comలో తాము అందుబాటులో ఉంటామని విస్తారా ట్వీట్ చేసింది.

Similar News

News February 17, 2026

ముగ్గురు IASలను పెళ్లి చేసుకున్న IAS ఆఫీసర్!

image

IAS ఆఫీసర్ అవీ ప్రసాద్ 3 పెళ్లిళ్లు చేసుకోవడం, ముగ్గురు భార్యలూ IASలే కావడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ క్యాడర్(2014 బ్యాచ్)కి చెందిన ప్రసాద్ తొలుత IAS రిజు బఫ్నాను పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకొని 2016 బ్యాచ్ ఆఫీసర్ మిషా సింగ్‌ను వివాహమాడారు. 4ఏళ్ల తర్వాత ఆమె నుంచీ విడిపోయారు. ఈనెల 11న 2017 బ్యాచ్ ఆఫీసర్ అంకిత ధాక్రేను పెళ్లాడారు. వీరంతా ప్రస్తుతం MPలోనే పనిచేస్తున్నారు.

News February 17, 2026

రైళ్ల టాయిలెట్ల శుభ్రతకు ఏఐ టెక్నాలజీ

image

రైళ్లలో అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా టాయిలెట్లు ఉంటాయి. ఈ సమస్య పరిష్కారానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. రిజర్వ్, జనరల్ బోగీల్లోనూ గంటకోసారి శుభ్రం చేసేలా AIని వాడుతోంది. తొలిదశలో 100 రైళ్లలో ప్రారంభించినట్లు చీఫ్ ప్రాజెక్ట్ ఇంజినీర్ లక్ష్మణ్ తెలిపారు. ‘క్లీనింగ్‌కు ముందు, తర్వాత ఫొటోలను మొబైల్ యాప్‌లో సిబ్బంది అప్‌లోడ్ చేయాలి. వాటిలో ఏ మాత్రం తేడా ఉన్నా AI అప్రమత్తం చేస్తుంది’ అని చెప్పారు.

News February 16, 2026

ప్రపంచానికే పరిష్కారాలు చూపుతాం: మోదీ

image

ఢిల్లీ కేంద్రంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు జరగనున్న ‘ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఆవిష్కర్తలు, పరిశోధకులు, ఔత్సాహికుల మధ్య ఉండటంవల్ల భారతీయ ప్రతిభ, ఏఐ సామర్థ్యం గురించి అవగాహన కలుగుతోంది. అందరం కలిసి మన దేశానికే కాకుండా అనేక సమస్యలపై ప్రపంచానికే పరిష్కారాలను చూపుతాం’ అని రాసుకొచ్చారు.