News November 11, 2024
‘విస్తారా’కు టాటా..!
టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ‘విస్తారా’ ఇండియాలో తన చివరి విమాన సర్వీసును పూర్తి చేసింది. ఈ కంపెనీ ఎయిర్ ఇండియాలో విలీనం కావడంతో ఆ బ్రాండ్ ఇవాళ్టితో మన దేశంలో కనుమరుగు అవ్వనుంది. రేపటి నుంచి విస్తారా విమానాలు కూడా ఎయిర్ ఇండియా పేరుతో నడుస్తాయి. ఇక నుంచి తమ వెబ్‌సైట్ అందుబాటులో ఉండదని, రేపటి నుంచి http://airindia.comలో తాము అందుబాటులో ఉంటామని విస్తారా ట్వీట్ చేసింది.
Similar News
News December 8, 2024
కేసీఆర్ వారసుడెవరు? కేటీఆర్ సమాధానమిదే
TG: బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్‌కు వారసుడెవరనే ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు. గులాబీ బాసే మరో మూడు-నాలుగేళ్లలో సీఎం అవుతారని చెప్పారు. ప్రజలు, పార్టీనే వారసుడిని నిర్ణయిస్తుందని తెలిపారు. కేసీఆర్ వంటి నాయకుడి కింద పనిచేయడమే తమ అదృష్టమన్నారు. తిరిగి KCRను సీఎంగా చూడటమే తన లక్ష్యమన్నారు. ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారికి పార్టీలో బాధ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు.
News December 8, 2024
చైతూ భర్తగా రావడం నా అదృష్టం: శోభిత
నాగ చైతన్య సింప్లిసిటీ, మంచి మనసు తనను ఆకట్టుకున్నాయని భార్య శోభితా ధూళిపాళ వెల్లడించారు. అలాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అతను హుందాగా, ప్రశాంతంగా ఉంటాడని, మర్యాదగా ప్రవర్తిస్తాడని పేర్కొన్నారు. ఎలాంటి ప్రేమ కోసమైతే ఎదురుచూశానో అది చైతూ నుంచి దక్కిందన్నారు. తనను జాగ్రత్తగా చూసుకుంటాడని తెలిపారు. ఈ ప్రేమ జంట ఈ నెల 4న పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే.
News December 8, 2024
రేవంత్ ఏడాది పాటు వారి కోసమే పనిచేశారు: కేటీఆర్
TG: రాష్ట్రంలో మాజీ సర్పంచ్ నుంచి మాజీ సీఎం వరకు అందరిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని కేటీఆర్ అన్నారు. ప్రతి గ్రామంలో 60% పైన ప్రజలు కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పారు. ప్రజల్లో వ్యతిరేకత లేదని కాంగ్రెస్ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. మూసీ వెనుక మూటల దోపిడీ ఉందని దుయ్యబట్టారు. రేవంత్ ఈ ఏడాది పాలనలో అదానీ, బావమరిది, బ్రదర్స్ కోసమే పనిచేశారని ఆరోపించారు.