News July 27, 2024
పెరిగిన ఇంటి విలువను బట్టే Tax మోత
పెరిగిన ప్రాపర్టీ వాల్యూ బట్టే LTCG Tax భారం ఉంటుందట. CAGR 10% మించితే 12.5%, తక్కువుంటే ఇండెక్సేషన్ విధానం బెటర్. Ex.2004లో ₹5L ప్రాపర్టీ 8% CAGRతో ₹23.30L అవుతుంది. ఇండెక్సేషన్ కాస్ట్ ₹16.6L అయితే LTCG ₹7.2L. దీనిపై 20% పన్ను ₹1.45L. కొత్తదాంట్లో LTCG ₹18.30Lపై ₹2.29L కట్టాలి. 12% CAGRతో ప్రాపర్టీ విలువ ₹48.23L, ఇండెక్స్ క్టాస్ ₹16L అవుతాయి. 20% కింద ₹6.3L, 12.5% కింద ₹1.03L Tax చెల్లించాలి.
Similar News
News October 14, 2024
సీఐడీకి జెత్వానీ కేసు
AP: ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసు దర్యాప్తును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఇప్పటివరకు ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేయగా, ఆ ఫైళ్లన్నింటినీ సీఐడీకి అప్పగించాలని డీజీపీ తిరుమలరావు ఆదేశించారు. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, విశాల్ గున్నీ, కాంతిరాణాలను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది.
News October 14, 2024
‘విదేశీ విద్యానిధి’ అర్హులకు గుడ్ న్యూస్?
TG: రాష్ట్రంలో విదేశీ విద్యా నిధి పథకం లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే SC, ST, BC సంక్షేమ శాఖలు ఇందుకు సంబంధించిన ఫైలును CMOకు పంపినట్లు సమాచారం. త్వరలోనే ఈ ఫైలును CM రేవంత్ ఆమోదిస్తారని, ఉత్తర్వులు కూడా జారీ అవుతాయని వార్తలు వస్తున్నాయి. కాగా బీసీ లబ్ధిదారులను 300 నుంచి 800, ఎస్సీలను 210 నుంచి 500, ఎస్టీలను 100 నుంచి 500కు పెంచాలని ప్రతిపాదనలు పంపారు.
News October 14, 2024
మళ్లీ దూసుకొస్తున్న ట్రంప్
US అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పుంజుకున్నారు. మొన్నటి వరకు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ విజయం ఖాయమని సర్వేలు అంచనా వేశాయి. ఆమె వైపు 48% మంది అమెరికన్లు మొగ్గు చూపగా ట్రంప్‌నకు 44% మంది మద్దతు పలికారు. అయితే తాజా సర్వేల్లో ఈ అంతరం 2శాతంగా ఉంది. ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కమలకు ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది.