News January 9, 2025

TCS షేర్ల‌కు రూ.76 డివిడెండ్‌

image

Q3లో TCS నిక‌ర లాభం 12% పెరిగి ₹12,380 కోట్లుగా న‌మోదైంది. గ‌త ఏడాది ఇదే Dec క్వార్ట‌ర్‌లో లాభం ₹11,058 కోట్లుగా ఉంది. తాజా ఫలితాల వెల్ల‌డి నేప‌థ్యంలో ఒక్కో షేరుకు ₹10 మ‌ధ్యంత‌ర డివిడెండ్‌తోపాటు ₹66 స్పెష‌ల్ డివిడెండ్ చెల్లించ‌నున్న‌ట్టు సంస్థ ప్ర‌క‌టించింది. జనవరి 17ను రికార్డు డేట్‌గా ప్రకటించింది. ఫిబ్రవరి 3న డివిడెండ్ చెల్లించనుంది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో గురువారం షేరు ధర 1.57% పతనమైంది.

Similar News

News November 21, 2025

హారతిని కళ్లకు అత్తుకుంటున్నారా?

image

చాలామంది హారతిని కళ్లకు అత్తుకుంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడికి దిష్టి తీయడం కోసమే హారతి ఇస్తారని, దాన్ని కళ్లకు అత్తుకోకూడదని సూచిస్తున్నారు. ‘ఇంట్లో, చిన్న పిల్లలకు చెడు దృష్టి తగలకుండా దిష్టి తీసినట్లే స్వామివారికి దృష్టి దోషం పోవడానికే హారతి ఇస్తారు. అందులో ఏ సానుకూల శక్తి ఉండదు. దిష్టి తీసిన గుమ్మడికాయను వదిలేసినట్లే హారతిని కూడా వదిలేయాలి’ అని వివరిస్తున్నారు.

News November 21, 2025

RRB-NTPC ఫలితాలు విడుదల

image

RRB-NPTC 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి సీబీటీ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి https://indianrailways.gov.in/లో ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 27.55లక్షల మంది పరీక్ష రాయగా.. 51,979మంది సీబీటీ 2కు అర్హత సాధించారు.

News November 21, 2025

ఢిల్లీ హైకోర్టులో గౌతమ్ గంభీర్‌కు ఊరట

image

భారత్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో లైసెన్స్ లేకుండా కొవిడ్-19 మందులు నిల్వ చేసి, పంపిణీ చేశారని గంభీర్, కుటుంబ సభ్యులు, ఛారిటబుల్ ఫౌండేషన్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తీర్పు చెప్పారు. ఫిర్యాదును కొట్టివేస్తున్నట్టు వెల్లడించారు. పూర్తి తీర్పు రావాల్సి ఉంది.