News March 10, 2025
నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు

AP: MLA కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురు టీడీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి అభ్యర్థులు కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు నామినేషన్ పత్రాలను అందించారు. అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేశ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు.
Similar News
News March 10, 2025
ప్రధాని మోదీని కలిసిన ఈటల

TG: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఈటల మనవడిని ముద్దు చేసిన మోదీ చాక్లెట్లు అందించారు. కుటుంబ సమేతంగా మోదీతో గడిపిన క్షణాలకు సంబంధించిన ఫొటోలను Xలో ఈటల పంచుకున్నారు. ప్రధానితో చాలా విలువైన సమయం గడిపానని, తన జీవితంలో ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోనని రాసుకొచ్చారు.
News March 10, 2025
కేంద్రమంత్రి నాలిక అదుపులో పెట్టుకోవాలి: సీఎం స్టాలిన్

కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘ధర్మేంద్ర తనను తాను రాజు అనుకుంటున్నారు. ఆయన నాలిక అదుపులో పెట్టుకోవాలి. ‘పీఎం శ్రీ’ పథకాన్ని మేమెప్పుడూ ఒప్పుకోలేదు. కానీ మేం ఒప్పుకుని మాట మార్చామంటూ ఆయన అవాస్తవాలు చెబుతున్నారు. మీరు తమిళనాడు విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధుల్ని ఇస్తారా లేదా ముందు అది చెప్పండి’ అని ప్రశ్నించారు.
News March 10, 2025
పుష్ప-2 లాభాలను దానికోసం వాడేలా చూడండి: హైకోర్టులో పిల్

TG: పుష్ప-2 సినిమాకు వచ్చిన లాభాలను చిన్న బడ్జెట్ సినిమాల రాయితీకి ఉపయోగించాలని నరసింహారావు అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం లాభాలను కళాకారుల సంక్షేమానికి వాడాలని అందులో కోరారు. కేసులో తదుపరి విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది. గత ఏడాది డిసెంబరులో విడుదలైన పుష్ప-2 అన్ని భాషల్లో కలిసి రూ.1800 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది.