News March 10, 2025
నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు

AP: MLA కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురు టీడీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి అభ్యర్థులు కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు నామినేషన్ పత్రాలను అందించారు. అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేశ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు.
Similar News
News March 21, 2025
మాకూ ఆ పథకాన్ని వర్తింపజేయండి: ఈబీసీలు

TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని తమకూ వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఈబీసీ సంక్షేమ సంఘం లేఖ రాసింది. అగ్రవర్ణ పేద యువతను సీఎం విస్మరించడం బాధకరమని లేఖలో పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరింది. కాగా ఈ పథకంతో రాష్ట్రంలో 5 లక్షల మందికి గరిష్ఠంగా రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది.
News March 21, 2025
IOC కొత్త ప్రెసిడెంట్‌గా కిర్స్టీ కోవెంట్రీ

ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్‌గా జింబాబ్వే స్విమ్మర్, పొలిటీషియన్ కిర్స్టీ కోవెంట్రీ ఎన్నికయ్యారు. దీంతో IOC తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. గ్రీస్‌లో జరిగిన 144వ IOC సెషన్‌లో కమిటీ మెంబర్స్ ఆమెను ఎన్నుకున్నారు. ఈ సెషన్‌లో పాల్గొన్న ఐసీసీ ఛైర్మన్ జైషా ఆమెకు విషెస్ తెలిపారు. లాస్ ఏంజెలిస్-2028 ఒలింపిక్స్ గేమ్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 21, 2025
పాస్టర్ల గౌరవ వేతనం విడుదల

AP: రాష్ట్రంలోని పాస్టర్లకు మూడు నెలల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,427మంది పాస్టర్లకు రూ.12,82,78,000 నిధులు విడుదల చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రభుత్వం గత ఏడాది మే నెల నుంచి పాస్టర్లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తున్న సంగతి తెలిసిందే.