News April 12, 2024
తెలంగాణలో ఎన్నికలకు టీడీపీ దూరం!

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయకూడదని TDP నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరునగరి వెల్లడించారు. APలో NDAలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, TGలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తామని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై మహానాడులో నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 20, 2025
ఒకే ఫ్రేమ్‌లో కెప్టెన్లు

ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆవిష్కరించారు. ఐపీఎల్ ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్లు గ్రూప్ ఫొటో దిగారు. కెప్టెన్లు కమిన్స్, అయ్యర్, గిల్, పంత్, రుతురాజ్, హార్దిక్, పాటిదార్, శాంసన్, రహానే, అక్షర్ పటేల్ ఫొటోషూట్‌లో సందడి చేశారు. కాగా ఎల్లుండి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. 65 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం 74 మ్యాచులు జరగనున్నాయి.
News March 20, 2025
చరిత్ర సృష్టించిన ‘ఛావా’

శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ చరిత్ర సృష్టించింది. ‘బుక్ మై షో’లో 12 మిలియన్ టికెట్లు సేల్ అయిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. దేశంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు(రూ.767కోట్లు), విడుదలైన ఐదో వారంలో రూ.22కోట్లు వసూలు చేసిన తొలి మూవీగానూ హిస్టరీ క్రియేట్ చేసింది. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా FEB 14న రిలీజైన విషయం తెలిసిందే.
News March 20, 2025
వీరు షెఫ్‌లే.. కానీ ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే

షెఫ్‌లే కదా అని వారిని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. వారి ఆస్తులు రూ.కోట్లలో ఉంటాయి మరి. ప్రకటనల్లో తరచూ కనబడే సంజీవ్ కపూర్ దేశంలోని షెఫ్‌లలో అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి విలువ రూ.1165 కోట్లకు పైమాటే. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వికాస్ ఖన్నా(సుమారు రూ.120 కోట్లు), రణ్‌వీర్ బ్రార్(రూ.41 కోట్లు), కునాల్ కపూర్ (రూ.43.57 కోట్లు), గరిమా అరోరా (రూ.40 కోట్లు), హర్‌పాల్ సింగ్ సోఖి(రూ.35 కోట్లు) ఉన్నారు.