News March 26, 2024

పెండింగ్ స్థానాల్లో టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే

image

టీడీపీ పెండింగ్‌లో ఉంచిన స్థానాల్లో IVRS సర్వేలు చేపడుతోంది. విజయనగరం MP సీటు కోసం ముగ్గురి పేర్లు తెరపైకి తెచ్చారు. విజయనగరం అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ మీసాల గీత, ఎచ్చెర్ల సీటు ఆశిస్తున్న అప్పలనాయుడుతో పాటు కంది చంద్రశేఖర్ పేరుతో సర్వే చేస్తున్నారు. ఇటు కడప MP సీటు కోసం శ్రీనివాసులు రెడ్డి, భూపేశ్ రెడ్డి, వీరశివారెడ్డి పేర్లు పరిశీలిస్తున్నారు. ఒంగోలు, అనంతపురం ఎంపీ సీట్లూ పెండింగ్‌లో ఉన్నాయి.

Similar News

News April 10, 2026

CRPFలో 9,175 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

image

CRPFలో 9,175 కానిస్టేబుల్(మెన్స్-9,096, ఉమెన్స్-79) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో 504, టీజీలో 356 పోస్టులున్నాయి. టెక్నికల్, ట్రేడ్స్‌మెన్, పయనీర్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ నెల 20 నుంచి మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, సంబంధిత విభాగంలో ITI పాసైన వారు అర్హులు. వయసు 18-23 ఏళ్లు ఉండాలి. వెబ్‌సైట్: https://www.rect.crpf.gov.in

News April 10, 2026

రానున్న 3 గంటల్లో వర్షాలు: APSDMA

image

AP: రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. ఆ సమయంలో గంటకు 40-50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. పిడుగులు పడే ఆస్కారమున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని పేర్కొంది.

News April 10, 2026

వెజైనల్​ ఇన్ఫెక్షన్స్‌తో సంతాన సమస్యలు

image

మహిళల్లో వైట్​ డిశ్చార్జ్​ రంగు మారినా, వెజైనా పొడిబారి మంట, దురద వస్తూ స్పాటింగ్ కనిపిస్తున్నా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే. అయితే కొన్ని ఇన్ఫెక్షన్స్​ వల్ల ఫెలోపియన్​ ట్యూబ్స్​ బ్లాక్​ అవుతాయి. దాంతో పిండం గర్భాశయంలోకి వెళ్లదు. దాన్నే ఎక్టోపిక్​ ప్రెగ్నెన్సీ అంటారు. దీన్ని గుర్తించకపోతే ఫెలోపియన్​ ట్యూబ్స్ పగిలి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఏవైనా ఇన్ఫెక్షన్లు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.