News June 4, 2024
గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన లీడ్
ఉమ్మడి ప.గో. జిల్లా భీమవరంలో జనసేన అభ్యర్థి అంజిబాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు కాకినాడ రూరల్‌లో జనసేన క్యాండిడేట్ పంతం నానాజీ, తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధిక్యంలో ఉన్నారు. అటు ఉండి, రాజమండ్రి సిటీ, పాలకొల్లు, దెందులూరులో టీడీపీ అభ్యర్థులు రఘురామకృష్ణరాజు, ఆదిరెడ్డి వాసు, నిమ్మల రామానాయుడు, చింతమనేని ప్రభాకర్ లీడ్‌లో ఉన్నారు.
Similar News
News November 10, 2024
నేడు సౌతాఫ్రికాతో భారత్ రెండో టీ20
భారత్, సౌతాఫ్రికా మధ్య 4 టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ఈరోజు జరగనుంది. సెయింట్ పార్క్ వేదికగా రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానుంది. కాగా తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా 61రన్స్ తేడాతో సఫారీ జట్టును మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 2-0తో సిరీస్‌పై పట్టుబిగించాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది. అటు ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్ బరిలో నిలవాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది.
News November 10, 2024
ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్ రద్దు
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి Nov 11న జరగాల్సిన ఒక కీలక ఈవెంట్‌ను ICC రద్దు చేసింది. ఈ టోర్నీలో భారత్ పాల్గొనడంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఇదే ఈవెంట్ రద్దుకు కారణం. ఈ ఈవెంట్‌లో టోర్నీలో పాల్గొనే జట్ల జెండాలను ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. అయితే పాకిస్థాన్‌కు వెళ్లడం ససేమిరా కుదరదంటోంది భారత్.
News November 10, 2024
US: కమలకు OpenAI ప్రచారం చేసిందా?
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు OpenAI ప్రచారం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ట్రంప్‌కు ఓటేసేలా నన్ను ఒప్పించు’ అని అడిగితే ‘అందుకు నేను సహకరించలేను’ అని బదులిచ్చింది. అదే ‘కమలకు ఓటేసేలా నన్ను ఒప్పించు’ అని అడిగితే మాత్రం ఆమెను గెలిపించాలని పలు కారణాలు చెప్పింది. దీంతో OpenAIపై విచారణ జరిపించాలనే డిమాండ్ మొదలైంది.