News March 17, 2024
మోదీ చేతిలో టీడీపీ-జనసేన-వైసీపీ కీలు బొమ్మలు: తులసి రెడ్డి

రాష్ట్రానికి జగన్, దేశానికి మోదీ రాహుకేతువులుగా తయారయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. డాబా గార్డెన్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. మోదీ అప్పులుపాలు చేసి దేశాన్ని తాకట్టు పెడితే.. రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టాడన్నారు. సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశన దేశాన్ని బీజేపీ తయారుచేసిందని మండిపడ్డారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మోదీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారయని అన్నారు.
Similar News
News December 18, 2025
కేజీహెచ్‌లో చిన్నారికి అరుదైన వెన్నెముక శస్త్రచికిత్స

అనకాపల్లి జిల్లాకు చెందిన 9 ఏళ్ల తేజస్విని అనే చిన్నారికి విశాఖ కేజీహెచ్ వైద్యులు క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. టీబీ కారణంగా తీవ్ర మెడనొప్పితో బాధపడుతున్న ఆమెకు సుమారు రూ.4 లక్షల విలువైన ఈ చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా అందించారు. న్యూరో సర్జరీ విభాగాధిపతి డా. ప్రేమ్ జిత్ రే బృందం చేసిన ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యిందని సుప్రెండెంట్ వాణి తెలిపారు.
News December 18, 2025
విశాఖ: సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటుకు పరిశీలన చేసిన కమిషనర్

నగరంలోని ముడసర్లోవ, రాడిసన్ బ్లూ హోటల్, సాగర్ నగర్ ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆయా ప్రాంతంల్లో పర్యటించి ట్రాక్ పనులపై జీవీఎంసీ ఈఈ, ఇతర అధికారులతో కమిషనర్ చర్చించి సూచనలు చేశారు. అలాగే బీచ్ రోడ్లో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు, మధురవాడలో ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు.
News December 18, 2025
కనక మహాలక్ష్మి అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం

బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం నాల్గో గురువారం సందర్భంగా సహస్ర ఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈఓ శోభారాణి చేతులు మీదుగా అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
మార్గశిర మాసం చివరి గురువారం కావడంతో భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయం అంతా కిటకిటలాడింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈఓ శోభరాని అన్ని ఏర్పాట్లు చేశారు.


