News June 13, 2024

TDP-JSP-BJP హనీమూన్‌ నడుస్తోంది: జగన్

image

AP: ప్రస్తుతం రాష్ట్రంలో NDA కూటమి హనీమూన్ నడుస్తోందని MLCలతో భేటీలో మాజీ CM జగన్ అన్నారు. హామీల అమలుకు కొద్దిరోజులు సమయం ఇద్దామన్నారు. ‘ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడొద్దు. ప్రలోభాలకు లొంగకుండా సమస్యలపై పోరాడాలి. త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తా. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలా ఉన్నాయి. EVMల గోల్‌మాల్‌‌పై చర్చ జరగాలి. శిశుపాలుడి వంటి చంద్రబాబు తప్పులను ఎప్పటికప్పుడు లెక్కించాలి’ అని ఆయన సూచించారు.

Similar News

News December 6, 2025

వంటింటి చిట్కాలు

image

*వెల్లుల్లిపాయ పొట్టు త్వరగా రావాలంటే.. వాటిని పెనం మీద వేసి కొద్దిసేపు వేడి చేయాలి. ఇలా చేస్తే పొట్టు ఈజీగా వస్తుంది.
*కర్రీలో పులుపు మరీ ఎక్కువగా ఉంటే బెల్లం లేదా ఉప్పు కలిపి చూడండి. ఇక్కడ ఉప్పును రుచి చూసి కలుపుకోవాలి.
* కాకరకాయ కూర వండేటప్పుడు కాస్త నిమ్మరసం వేస్తే చేదు తగ్గుతుంది.
* పకోడీలు కరకరలాడుతూ రావాలంటే పిండి కలిపేటప్పుడే ఒక చెంచా మరుగుతున్న నూనె కలపాలి.

News December 6, 2025

7వేల కి.మీ పొడవైన నది.. కానీ బ్రిడ్జిలు ఉండవు!

image

ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెజాన్ నదిపై వంతెనలు లేవని మీకు తెలుసా? అవును. ఈ నది బ్రెజిల్, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, బొలివియా, వెనిజులా, గయానా, సురినామ్ దేశాల మీదుగా దాదాపు 7వేల కి.మీ ప్రవహిస్తుంది. దీని వెడల్పు 3-10 కి.మీ ఉంటుంది. వర్షాకాలంలో అది 48 కి.మీ వరకు విస్తరిస్తుంది. లోతు 330 అడుగులకు చేరుతుంది. అంతేకాదు అక్కడి మృదువైన నేలల్లో బ్రిడ్జిలు నిర్మించడం చాలా కష్టం. అందుకే బోట్లలో నది దాటుతారు.

News December 6, 2025

‘కింగ్’ కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీ చేస్తారా?

image

విశాఖ వేదికగా IND-SA మధ్య ఇవాళ నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి కోహ్లీపైనే ఉంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన విరాట్‌.. ఈరోజు సెంచరీ చేసి హ్యాట్రిక్‌ సాధిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. విశాఖ పిచ్‌పై కోహ్లీకి అద్భుతమైన రికార్డు (7 మ్యాచ్‌ల్లో 3 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు) ఉంది. చిన్న బౌండరీలు కూడా అనుకూలంగా మారనున్నాయి. అన్నీ కలిసొస్తే మరో సెంచరీ ఖాయం.