News June 13, 2024

TDP-JSP-BJP హనీమూన్‌ నడుస్తోంది: జగన్

image

AP: ప్రస్తుతం రాష్ట్రంలో NDA కూటమి హనీమూన్ నడుస్తోందని MLCలతో భేటీలో మాజీ CM జగన్ అన్నారు. హామీల అమలుకు కొద్దిరోజులు సమయం ఇద్దామన్నారు. ‘ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడొద్దు. ప్రలోభాలకు లొంగకుండా సమస్యలపై పోరాడాలి. త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తా. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలా ఉన్నాయి. EVMల గోల్‌మాల్‌‌పై చర్చ జరగాలి. శిశుపాలుడి వంటి చంద్రబాబు తప్పులను ఎప్పటికప్పుడు లెక్కించాలి’ అని ఆయన సూచించారు.

Similar News

News September 14, 2024

ఎల్లుండి ఖైరతాబాద్ గణేశ్ దర్శనం లేదు

image

TG: ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక ప్రకటన చేసింది. సోమవారం మహాగణపతి దర్శనానికి అనుమతి లేదని చెప్పింది. శని, ఆదివారం మాత్రమే అనుమతి ఇస్తామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. మంగళవారం నిమజ్జనం ఉండటంతో సోమవారం వెల్డింగ్ తదితర పనుల నేపథ్యంలో భక్తులను అనుమతించబోమని పేర్కొంది. కాగా మంగళవారం మధ్యాహ్నానికి లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు.

News September 14, 2024

వైద్యులు వర్షంలో ఉంటే నాకు నిద్ర పట్టలేదు: సీఎం మమత

image

కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనలో న్యాయం కోసం నిరసనలు చేస్తున్న వైద్యుల వద్దకు బెంగాల్ CM మమత ఈరోజు వెళ్లారు. వారు వర్షంలోనే నిరసనలు తెలుపుతుండటంతో తనకు రాత్రంతా నిద్రపట్టలేదని తెలిపారు. ‘నిరసనలు తెలియజేయడం మీ హక్కు. వాటికి సెల్యూట్ చేసేందుకే ఇక్కడికి వచ్చాను. నా పదవి కంటే మీ గొంతుకే ముఖ్యం. మీ డిమాండ్లన్నీ పరిశీలిస్తాను. నిందితుల్ని శిక్షిస్తాను. దయచేసి విధులకు హాజరుకండి’ అని కోరారు.

News September 14, 2024

సురేశ్ ప్రొడక్షన్స్ ట్విటర్ ఖాతా హ్యాక్?

image

నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ ట్విటర్ ఖాతా హ్యాక్ అయిందా? ఆ ఖాతాలో తాజాగా పోస్ట్ అయిన ఓ ట్వీట్‌ను చూస్తే ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘Introducing $BERRY on Solana the next 100x gem! CA: 6V5javYTHoxRKMvugNV1AoSYjUerwM9FqTjqeRmZS9TJ Let’s pump this together!’ అంటూ ట్వీట్ చేశారు. ఇది క్రిప్టోకరెన్సీ గురించిన స్పామ్ మెసేజ్ అని నెటిజన్లు వివరిస్తున్నారు.