News June 4, 2024

శ్రీకాకుళం ఎంపీ స్థానంలో టీడీపీ ముందంజ

image

AP: శ్రీకాకుళం ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ముందంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌పై రామ్మోహన్ నాయుడు 1,861 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Similar News

News November 9, 2024

రాహుల్ దిశానిర్దేశంలేని క్షిపణి: అస్సాం సీఎం

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నియంత్రణ లేదంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలు మండిపడ్డారు. ‘రాహుల్ ప్రస్తుతం నియంత్రణ లేని క్షిపణిలా ఉన్నారు. సోనియా శిక్షణనివ్వకపోతే మున్ముందు దారీతెన్నూ లేని క్షిపణిగా మారతారు. ఆయన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. ఝార్ఖండ్‌కు వచ్చిన రాహుల్ తీవ్రవాదుల గురించి ఒక్క ముక్కా మాట్లాడలేదు. ఆయన గిరిజనులకు, వెనుకబాటు వర్గాలకు వ్యతిరేకి’ అని విమర్శించారు.

News November 9, 2024

ప్రియాంకా చోప్రా నాకు రోల్ మోడల్: సమంత

image

ప్రియాంకా చోప్రా తనకు రోల్ మోడల్ అని నటి సమంత వెల్లడించారు. బిజినెస్ టుడే నిర్వహించిన ‘మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘సిటాడెల్ తొలి సీజన్ అమెరికాలో, రెండోది ఇటలీ, మూడోది భారత్, తర్వాత మెక్సికోలో జరుగుతుంటుంది. అమెరికా వెర్షన్‌లో ప్రియాంక నటించగా ఇండియా వెర్షన్‌లో నాకు అవకాశం దక్కింది. ప్రియాంక ఓ రోల్ మోడల్. గొప్పగా ఆలోచించడమనేది ఆమెనుంచే నేర్చుకుంటున్నా’ అని కొనియాడారు.

News November 9, 2024

అవును.. కెనడాలో ఖలిస్థానీలున్నారు: ట్రూడో

image

కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులున్నట్లు ఆ దేశ PM జస్టిన్ ట్రూడో అంగీకరించారు. అయితే తమ దేశంలోని సిక్కులందరికీ వారు ప్రతినిధులు కారని స్పష్టం చేశారు. మోదీని అభిమానించే హిందువులూ తమ దేశంలో ఉన్నారని, వారు కూడా మొత్తం హిందువులకు ప్రతినిధులు కాదని అన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీలకు కెనడా స్వర్గధామంగా మారిందన్న భారత్ ఆరోపణలకి ట్రూడో వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చాయి.