News June 6, 2024
ఈ నెల 11న టీడీపీ MLAల సమావేశం

AP: ఈ నెల 11న టీడీపీ శాసన సభ్యులు సమావేశం కానున్నారు. పార్టీ చీఫ్ చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు. మరుసటి రోజు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలతో పాటు ఎన్డీఏ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Similar News
News February 11, 2025
దేవుడి పేరుతో దాడులు దురదృష్టకరం: మంత్రి

TG: వీర రాఘవరెడ్డి, అతడి అనుచరుల దాడిలో గాయపడ్డ చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్‌ను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. దాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. దేవుడి పేరు మీద దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. నిందితుల్లో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశామని, ఆలయం వద్ద భద్రత పెంచుతామని చెప్పారు. అటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఇతర నేతలు సైతం రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు.
News February 11, 2025
1/70 చట్టాన్ని తొలగించే ప్రసక్తే లేదు: చంద్రబాబు

AP: గిరిజనుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. <<15423800>>1/70 చట్టాన్ని<<>> తొలగించే ప్రసక్తే లేదని ఆయన ట్వీట్ చేశారు. ‘గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుతాం. వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాం. గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం. 1/70 చట్టంపై దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. ఆందోళన, అపోహలతో గిరిజనులు ఆందోళన చెందొద్దు’ అని సీఎం పేర్కొన్నారు.
News February 11, 2025
సభలో మాట్లాడటానికే కదా గెలిపించింది: జీవీ

AP: అసెంబ్లీ అంటే భయంతోనే మాజీ CM జగన్ రావట్లేదని ప్రభుత్వ చీఫ్ విప్ GV ఆంజనేయులు ఆరోపించారు. ‘జగన్ అసెంబ్లీకి రాననడం సమంజసమేనా? ఆయనకు కనీసం ఇంగితజ్ఞానం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది సభ కాదు.. ప్రజలు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చిస్తే సమాధానమిస్తాం. ప్రజా సమస్యలపై ఆసక్తి లేదు కాబట్టే రావట్లేదు. గతంలో ఏ నాయకుడూ ఇలా చేయలేదు. సభలో మాట్లాడటానికే కదా ప్రజలు గెలిపించింది’ అని నిలదీశారు.