News July 18, 2024

ACA అధ్యక్షుడిగా టీడీపీ ఎంపీ కేశినేని?

image

AP: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధ్యక్షుడిగా TDP MP కేశినేని శివనాథ్ ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ జిల్లాల క్రికెట్ సంఘాలు, క్లబ్‌లు ఆయన అభ్యర్థిత్వానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుత అపెక్స్ కౌన్సిల్ త్వరలో రాజీనామా చేయనుంది. ఈ నెల 21న ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియను ప్రకటించనుంది. మరో నెలన్నరలో కొత్త ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు కానుందని అంచనా.

Similar News

News November 19, 2025

HEADLINES

image

* మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా ఎన్‌కౌంటర్
* ఏపీలో మావోయిస్టుల కలకలం.. 50 మందికిపైగా అరెస్ట్
* పుట్టపర్తి సత్యసాయి శత జయంతి సందర్భంగా రేపు ఏపీకి PM మోదీ
* డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం: TTD
* 2015 గ్రూప్-2 పరీక్ష ఫలితాలను రద్దు చేసిన TG హైకోర్టు
* TGలో వాట్సాప్‌లో ‘మీ-సేవ’లు ప్రారంభం
* భారీగా తగ్గిన బంగారం ధరలు

News November 19, 2025

టీవీ ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక

image

సున్నితమైన, రెచ్చగొట్టే కంటెంట్ ప్రసారంపై TV ఛానెళ్లకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఎర్రకోట పేలుడు సహా ఇటీవలి ఘటనలకు సంబంధించిన సమాచార ప్రసారానికి దూరంగా ఉండాలని కోరింది. కొన్ని ఛానెళ్లు హింసను ప్రేరేపించేలా, శాంతికి భంగం కలిగించేలా, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వీడియోలు టెలికాస్ట్ చేశాయని పేర్కొంది. ఇది చట్టవిరుద్ధమని, అలాంటి కార్యకలాపాలను ప్రోత్సహించే దృశ్యాలను ప్రసారం చేయొద్దని సూచించింది.

News November 19, 2025

ఈ నెల 27న రాహుల్ పెళ్లి.. సీఎంకు ఆహ్వానం

image

స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 27న ప్రియురాలు హరిణ్యతో ఆయన వివాహం జరగనుంది. కాబోయే దంపతులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి శుభలేఖ అందజేసి ఆహ్వానించారు. ఏపీకి చెందిన టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కూతురే హరిణ్యా రెడ్డి. ఇక రాహుల్ పాడిన ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే.