News August 11, 2025
మోదీ, అమిత్ షాతో టీడీపీ ఎంపీల భేటీ

AP: ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో టీడీపీ ఎంపీలు సమావేశం అయ్యారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో తొలుత షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. వెంటనే నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరారు. అనంతరం ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.
Similar News
News August 12, 2025
మాజీ ఎమ్మెల్యేలు కన్నుమూత

AP: అన్నమయ్య(D) రాజంపేట మాజీ MLA కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి(78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1989లో రాజంపేట నుంచి INC MLAగా గెలిచారు. 1985, 1994, 2009లో పోటీ చేసి ఓడిపోయారు. అటు తిరుపతి(D) శ్రీకాళహస్తి మాజీ MLA తాటిపర్తి చెంచురెడ్డి కూడా తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1988 ఉపఎన్నికలో INC తరఫున MLAగా గెలిచారు.
News August 12, 2025
ట్రంప్ అండతో పాక్ అధ్యక్షుడిగా ఆసిమ్ మునీర్?

భారత్‌కు దూరమవుతున్న ట్రంప్ పాక్‌ను అక్కున చేర్చుకుంటున్నారు. ఈక్రమంలోనే ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ఆ దేశ అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. 2 నెలల్లో మునీర్ 2 సార్లు US వెళ్లారు. పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధ్యక్ష పదవి దక్కించుకునేలా ట్రంప్‌తో కలిసి ప్లాన్ వేస్తున్నట్లు భారత విదేశాంగ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఇప్పటికే US గడ్డపై నుంచి మునీర్ భారత్‌పై విషం కక్కుతున్నారు.
News August 11, 2025
మార్పుల తర్వాత ఇన్‌కమ్ టాక్స్ బిల్లుకు ఆమోదం

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ LSలో ప్రవేశపెట్టిన ఇన్‌కమ్ టాక్స్ బిల్లు చర్చ లేకుండానే ఆమోదం పొందింది. FEBలోనే బిల్లును కేంద్రం LSలో ప్రవేశపెట్టింది. 1961 నుంచి ఎన్నో సవరణలకు గురై సంక్లిష్టంగా మారిందని విపక్షాలు అభ్యంతరం చెప్పాయి. దీంతో కేంద్రం సెలక్ట్ కమిటీకి రిఫర్ చేసింది. ఈక్రమంలోనే గత శుక్రవారం దాన్ని వెనక్కి తీసుకొని కమిటీ సూచనలతో మార్పులు చేసింది. ఇది 2026 APR 1 నుంచి అమల్లోకి రానుంది.