News June 4, 2024
పల్నాడులో కుమ్మేసిన టీడీపీ సీనియర్లు
AP: పల్నాడు జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలంతా దుమ్ములేపారు. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావుకి 32,795 ఓట్ల మెజార్టీ రాగా 1,09,885 ఓట్లు నమోదయ్యాయి. వినుకొండలో జీవీ ఆంజనేయులుకి 1,29,813 ఓట్లు పోలవగా 29,683 మెజార్టీ దక్కింది. గురజాలలో యరపతినేని శ్రీనివాస్ 29,100 మెజార్టీతో నెగ్గారు. ఆయనకు 1,02,396 ఓట్లు పడ్డాయి.
Similar News
News November 5, 2024
US Elections: డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం
న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నాచ్‌లో పోలింగ్ ముగిసింది. తొలి ఫలితం కూడా వచ్చేసింది. అర్హులైన ఓటర్లు అతితక్కువగా ఉండే ఈ ప్రాంతంలో 1960 నుంచి మిగిలిన రాష్ట్రాల కంటే ముందే పోలింగ్ జరుగుతోంది. ఈ ఫలితాల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌నకు చెరో మూడు చొప్పున బ్యాలెట్ ఓట్లు దక్కాయి. యూఎస్-కెనడా సరిహద్దులోని ఈ పట్టణ ప్రజలు గత రెండు అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చారు.
News November 5, 2024
నవంబర్ 25 నుంచి పార్లమెంటు సమావేశాలు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా వక్ఫ్ సవరణ బిల్లు సహా దేశంలో జమిలి ఎన్నికల బిల్లు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే నవంబర్ రెండో వారంలో పలు లోక్‌సభ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనుండడంతో కొత్త సభ్యుల ప్రమాణం కూడా ఉంటుంది.
News November 5, 2024
ఎల్లుండి ‘థగ్ లైఫ్’ నుంచి స్పెషల్ అప్డేట్
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన ‘థగ్ లైఫ్’ సినిమా నుంచి ఎల్లుండి స్పెషల్ అప్డేట్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. పెన్సిల్ ఆర్ట్‌తో కూడిన కమల్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. లోకనాయకుడి బర్త్ డే సందర్భంగా ఈనెల 7న ఉదయం 11 గంటలకు సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ వస్తుందన్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించారు.