News June 14, 2024
చంద్రబాబును కలిసిన టీడీపీ సీనియర్లు
AP: మంత్రి పదవి ఆశించి నిరాశకు గురైన పలువురు TDP సీనియర్లు CM చంద్రబాబును సచివాలయంలో కలిశారు. కేబినెట్ కూర్పు, భవిష్యత్తు ప్రణాళికలను వారికి వివరించిన CBN, కేబినెట్‌లో ఎందుకు చోటు కల్పించలేకపోయామనే అంశాన్ని వారికి తెలియజేశారు. మంత్రి పదవి రాని వారిని వేరే రూపంలో వినియోగించుకుంటామని బాబు హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో యనమల రామకృష్ణుడు, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు సహా పలువురు ఉన్నారు.
Similar News
News September 21, 2024
‘నందిని’ ఆవు నెయ్యి గురించి తెలుసా?
దేశంలో అమూల్ తర్వాత అతిపెద్ద మిల్క్ కార్పొరేషన్‌గా ‘నందిని మిల్క్’ బ్రాండ్‌కు మంచి గుర్తింపు ఉంది. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన Karnataka Cooperative Milk Producers’ Federation Limited ‘నందిని’ బ్రాండ్ పేరుతో పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పన్నీర్, చీజ్, బటర్, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి డెయిరీ ఉత్పత్తులను విక్రయిస్తుంది. స్వచ్ఛమైన ఆవు పాలతో నెయ్యిని తయారుచేస్తారు. దీనికి AGMARK సర్టిఫికెట్ కూడా ఉంది.
News September 21, 2024
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
AP: ఎంఎన్‌సీ కంపెనీల మద్యం బ్రాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకొస్తోంది. మెక్‌డోవెల్స్, ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ల మద్యం నిన్న రాష్ట్రానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ బ్రాండ్లను త్వరలోనే తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. జానీవాకర్, వాట్ 69, యాంటిక్విటీ, రాయల్ ఛాలెంజ్, వోడ్కా, బ్లాక్ డాగ్ బ్రాండ్లు త్వరలోనే వస్తాయన్నారు.
News September 21, 2024
కొత్తదారులు వెతకడమే ‘బైడెన్, మోదీ మీటింగ్’ ఎజెండా
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఏర్పడిన కీలక దేశాల కూటమే క్వాడ్ అని PM మోదీ అన్నారు. అమెరికాకు బయల్దేరే ముందు ఆయన మాట్లాడారు. ‘క్వాడ్ సమ్మిట్లో ప్రెసిడెంట్ బైడెన్, PM అల్బనీస్, PM కిషిదాను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ప్రపంచం మేలు, మన ప్రజల ప్రయోజనం కోసం IND-US అంతర్జాతీయ భాగస్వామ్యం మరింత బలోపేతానికి కొత్త మార్గాలను బైడెన్‌తో సమావేశంలో అన్వేషిస్తాం’ అని అన్నారు.