News June 4, 2024

3 ఎంపీ స్థానాల్లో టీడీపీ గెలుపు

image

AP: పార్లమెంట్ సెగ్మెంట్లలోనూ టీడీపీ అభ్యర్థులు భారీ విజయం సాధిస్తున్నారు. శ్రీకాకుళం, నరసరావుపేట, హిందూపురం అభ్యర్థులు రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయులు, పార్థసారథి ప్రత్యర్థులపై గెలిచారు.

Similar News

News November 3, 2025

వారసత్వ రాజకీయాలపై శశిథరూర్ తీవ్ర విమర్శలు

image

వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని కాంగ్రెస్ MP శశిథరూర్ విమర్శించారు. భారత రాజకీయాలు కుటుంబ వ్యాపారాలుగా మారాయన్నారు. ‘దశాబ్దాలుగా ఒకే ఫ్యామిలీ ఆధిపత్యం చెలాయిస్తోంది. నెహ్రూ-గాంధీ డైనస్టీ ప్రభావం స్వతంత్ర పోరాటంతో ముడిపడి ఉంది. కానీ రాజకీయ నాయకత్వం జన్మహక్కు అనే ఆలోచన పాతుకుపోయేలా చేసింది’ అని ఓ వ్యాసంలో పేర్కొన్నారు. దీంతో రాహుల్, తేజస్వీపై థరూర్ నేరుగా అటాక్ చేశారని BJP చెప్పింది.

News November 3, 2025

యాక్సిడెంట్ల రికార్డులు లేవన్న TGSRTC.. విమర్శలు

image

TG: చేవెళ్ల RTC బస్సు ప్రమాదంలో 19 మంది మరణించడం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలపై OCTలో వివరాలు అడిగిన ఓ RTI కార్యకర్తకు తమ వద్ద అలాంటి రికార్డులు లేవని RTC చెప్పింది. ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నా రికార్డులు నిర్వహించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. అయితే 2017-21 వరకు 2,674 ఘటనల్లో 1,230 మంది మృతి చెందారని 2022లో ఓ దరఖాస్తుకు RTC సమాధానమిచ్చింది. ఇప్పుడు రికార్డులే లేవనడం చర్చనీయాంశంగా మారింది.

News November 3, 2025

₹1500 MO కేసు… 32 ఏళ్ల తర్వాత రిటైర్డ్ పోస్ట్‌మాస్టర్‌కి 3ఏళ్ల జైలు

image

మనీ ఆర్డర్ మోసం కేసులో నోయిడా కోర్టు తీర్పు చర్చనీయాంశమైంది. అరుణ్ 1993లో ₹1500 తండ్రికి MO చేశారు. సబ్‌పోస్టుమాస్టర్ మహేంద్ర కుమార్ కమీషన్‌‌తో కలిపి ₹1575కు నకిలీ రశీదు ఇచ్చి డబ్బును ప్రభుత్వానికి జమ చేయలేదు. సొమ్ము అందకపోవడంతో అరుణ్ ఫిర్యాదు చేయగా అధికారులు కేసుపెట్టారు. తప్పు అంగీకరించిన కుమార్ సొమ్మును తిరిగిచ్చేశాడు. విచారణ అనంతరం కోర్టు రిటైరైన అతడికి 3 ఏళ్ల జైలు, ₹10వేల జరిమానా విధించింది.