News June 4, 2024

3 ఎంపీ స్థానాల్లో టీడీపీ గెలుపు

image

AP: పార్లమెంట్ సెగ్మెంట్లలోనూ టీడీపీ అభ్యర్థులు భారీ విజయం సాధిస్తున్నారు. శ్రీకాకుళం, నరసరావుపేట, హిందూపురం అభ్యర్థులు రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయులు, పార్థసారథి ప్రత్యర్థులపై గెలిచారు.

Similar News

News November 8, 2024

ALERT.. ఇవాళ, రేపు వర్షాలు

image

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో ప్రతి ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. APలోని బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

News November 8, 2024

పెళ్లికి గోత్రం చూసేది ఎందుకంటే..

image

హిందువుల్లో పెళ్లిళ్లు చేయాలంటే పెద్దలు ప్రధానంగా చూసేది గోత్రం. సప్తర్షులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అత్రి, జమదగ్ని, గౌతముడు, భరద్వాజ, కశ్యపుడు వంశాలను స్థాపించారని, వారి పేర్ల మీదే గోత్రాలు ఏర్పడ్డాయని నమ్మిక. కాలక్రమంలో వంశీకుల పేర్ల మీద మరిన్ని గోత్రాలు వచ్చాయని చెబుతారు. ఒకే గోత్రం ఉన్న వారిని తోబుట్టువులుగా భావించి వివాహం చేయరు. అలా చేస్తే ఆరోగ్యవంతులైన పిల్లలు పుట్టరని భావిస్తారు.

News November 8, 2024

ఆ పోస్టులు చూసి సూసైడ్ చేసుకునేదాన్ని: హోంమంత్రి అనిత

image

AP: సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చూసి ఎంతో బాధపడేదాన్నని హోంమంత్రి అనిత అన్నారు. ‘కానీ నేను గట్టిదాన్ని. అందుకే చలించలేదు. బలహీన క్షణంలో కఠినమైన నిర్ణయం తీసుకోలేదు. లేదంటే ఆ పోస్టులు చూసి సూసైడ్ చేసుకునేదాన్ని. మానసికంగా బలహీనంగా ఉంటే అంతే సంగతులు. ఆత్మహత్యే శరణ్యం. సోషల్ మీడియాలో కొందరు ఉగ్రవాదుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని ఊరికే వదిలే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు.